ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్నికల నిర్వహణాధికారంపై పిల్​ కొట్టేసిన హైకోర్టు - hc struck down a petition filed by Nimmagadda

మున్సివల్ ఎన్నికలు నిర్వహించే అధికారం నిమ్మగడ్డ రమేశ్ కుమార్​కు లేదని దాఖలైన పిల్​ను హైకోర్టు కొట్టేసింది. న్యాయవాది పొన్న కంటే మల్లిఖార్జునరావు వేసిన ప్రజాహిత వ్యాజ్యాంపై కోర్టు విచారణ చేపట్టింది.మున్సిపల్ ఎన్నికలు చివరి దశలో పిటిషనర్ కోర్టును ఆశ్రయించారని ఆక్షేపించింది.

nimmagadda ramesh kumar News
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్​

By

Published : Mar 10, 2021, 1:34 AM IST

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్​కు మున్సిపల్ ఎన్నికలను నిర్వహించే అధికారం లేదని పేర్కొంటూ.. దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్​తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. పిటిషనర్ తరపు న్యాయవాది పీపీ కృష్ణయ్య, రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది అశ్వనీకుమార్, ప్రభుత్వం తరఫున అడ్వాకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పిల్​ను కొట్టేసింది. మున్సిపల్ ఎన్నికలు చివరి దశలో పిటిషనర్ కోర్టును ఆశ్రయించారని ఆక్షేపించింది.

గతంలో.. పదవీ కాలం పూర్తి కాకుండా ఎన్నిలక కమిషనర్ తొలగింపును ఉద్దేశించి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్​ను సవాలు చేస్తూ.. ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్, మరికొందరు గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఆ ఆర్డినెన్స్​ రద్దు చేస్తూ.. ఎస్​ఈసీగా రమేశ్ కుమార్​ను పునరుద్ధరించాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే ఎన్నికల కమిషనర్.. పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్- 200 ప్రకారం నియమితులైనందున మున్సివల్ ఎన్నికలను నిర్వహించే అధికారం నిమ్మగడ్డ రమేశ్ కుమార్​కు లేదని దర్మాసనం తీర్పు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ప్రస్తుత కమిషనర్ నిమ్మగడ్డ.. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకూడదని పేర్కొంటూ.. న్యాయవాది పొన్న కంటే మల్లిఖార్జునరావు హైకోర్టులో దాఖలు చేసిన పిల్​పై కోర్టు విచారణ జరిపింది.

ఇదీ చూడండి:

ఏపీమెడ్​టెక్ జోన్‌తో కలిసి పనిచేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆసక్తి

ABOUT THE AUTHOR

...view details