మూలధన విలువ అధారిత ఆస్తి పన్ను విధించేందుకు వీలుకల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ తీసుకొచ్చిన సవరణ చట్టంపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది.
మూలధన విలువ అధారిత ఆస్తి పన్ను విధించేందుకు వీలుకల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ పిటిషనర్లు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరపున న్యాయవాది ఎంవీ రాజారాం వాదనలు వినిపించారు.