ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HC on Village Secretariats: అక్కడ సచివాలయాలు ఇంకా కొనసాగుతున్నాయా? : హైకోర్టు - ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు కొనసాగుతున్నయా అని ప్రశ్నించిన హైకోర్టు

HC on village secretariats: ఇప్పటికీ గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు.. ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో కొనసాగుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలిపాలని.. పిటిషనర్లకు హైకోర్టు సూచించింది. అవసరం అయితే ఆ వివరాల ఆధారంగా న్యాయాధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయిస్తామని వ్యాఖ్యానించింది.

HC on village secretariats in govt school premises
అక్కడ సచివాలయాలు ఇంకా కొనసాగుతున్నాయేమో చెప్పండి: హైకోర్టు

By

Published : Apr 8, 2022, 9:24 AM IST

HC on village secretariats: ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో ఇప్పటికీ గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు కొనసాగుతున్నాయా లేదా అనే విషయాన్ని కోర్టుకు చెప్పాలని.. పిటిషనర్లకు హైకోర్టు సూచించింది. అవసరం అయితే ఆ వివరాల ఆధారంగా న్యాయాధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయిస్తామని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు కొనసాగుతున్నాయని పేర్కొంటూ గతంలో దాఖలైన పలు వ్యాజ్యాలు గురువారం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చాయి. విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఈ మేరకు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details