ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పాఠశాలల ఆవరణలో సచివాలయాలు.. అధికారులపై హైకోర్టు ధిక్కరణ కేసు

పాఠశాల ఆవరణలో సచివాలయాల నిర్మాణాలు చేపట్టారంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని పంచాయతీరాజ్ శాఖ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్లు, కార్యదర్శులకు నోటీసులు జారీ చేసి కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది.

High Court contempt case against officers over sachivalaya buildings at schools
పాఠశాలల ఆవరణలో సచివాలయాలు

By

Published : Jul 12, 2021, 6:43 PM IST

హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పాఠశాలల వద్ద గ్రామసచివాలయాల నిర్మాణం చేపట్టారంటూ ఉన్నత న్యాయస్థానం.. కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. పంచాయతీరాజ్ శాఖ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్లు, కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది.

నెల్లూరు జిల్లా కోటపోలూరు, కర్నూలు జిల్లాల్లో తాళ్లముడిపిలో పాఠశాలల ఆవరణలో గ్రామసచివాలయాల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. బడి ఆవరణలో గ్రామసచివాలయాలు కట్టవద్దని గతేడాది జూన్‌లో హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారంటూ..హైకోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది.

ABOUT THE AUTHOR

...view details