ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వీరికి ఘనస్వాగతం పలికారు. ఆలయ అధికారులు దగ్గరుండి మరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వారికి ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేదాశీర్వచం చేశారు. దుర్గ గుడి ఈవో భ్రమరాంబ, పాలకమండలి ఛైర్మన్ సోమినాయుడు జస్టిస్ ప్రశాంత్ కుమార్ దంపతులకు అమ్మవారి చిత్ర పటం, శేష వస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.
HC CHIEF JUSTICE: దుర్గమ్మ సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు - ఏపీ లేటెస్ట్ న్యూస్
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర దంపతులు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
దుర్గమ్మ సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు
TAGGED:
ap top news