నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీపై విచారణకు హైకోర్టు అనుమతించింది. ఇవాళ దీనిపై విచారణ చేపట్టనుంది. అనంతపురం జిల్లాకు చెందిన ఉమామహేశ్వరనాయుడు అనే వ్యక్తి ఆనందయ్య మందు పంపిణీపై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని పిటిషన్‌లో కోరారు. ఔషధ పంపిణీ ఖర్చును ప్రభుత్వమే భరించాలని కోరారు. హఠాత్తుగా మందు పంపిణీ ఆపడంతో ఇబ్బంది పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. లోకాయుక్త ఆదేశంతో పంపిణీ నిలిపివేసినట్లు పోలీసులు చెబుతున్నారని.. మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు.
ఆనందయ్య మందు పంపిణీపై నేడు హైకోర్టులో విచారణ - Anandayya Medicine Case in Hi Court News today
ఆనందయ్య ఔషధం పంపిణీపై విచారణకు అనుమతించిన హైకోర్టు.. ఇవాళ వాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆనందయ్య మందు పంపిణీపై అనంతపురం జిల్లాకు చెందిన ఉమామహేశ్వరనాయుడు దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం స్వీకరించింది. ఇవాళ విచారణ చేయనుంది.

ఆనందయ్య మందు పంపిణీపై నేడు హైకోర్టులో విచారణ