ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బెంజ్ సర్కిల్ వద్ద సర్వీసు రోడ్డు నిర్మాణ వ్యవహారంపై తీర్పు వాయిదా - high court Judgment adjourned service road issue at vijayawada

విజయవాడలోని బెంజ్ సర్కిల్ పై వంతెన వద్ద సర్వీసు రోడ్డు ఏర్పాటు వ్యవహారంపై దాఖలైన పిల్​పై విచారణ జరిపిన హైకోర్టు... తీర్పును వాయిదా వేసింది.

హైకోర్టు
హైకోర్టు

By

Published : Aug 3, 2021, 6:15 AM IST

విజయవాడలోని బెంజ్ సర్కిల్ ​పై వంతెన వద్ద సర్వీసు రోడ్డు ఏర్పాటు వ్యవహారంలో దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం... తీర్పును వాయిదా వేసింది. స్థానిక ప్రజల ఇబ్బందుల్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఎలాంటి అధ్యయనం చేకుండా... బెంజ్ సర్కిల్ సమీపంలో రెండో పైవంతెన ఏర్పాటు చేస్తున్నారని పేర్కొంటూ విజయవాడకు చెందిన వై.బసవేశ్వరరావు గతేడాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రెండో పైవంతెన ఏర్పాటు కారణంగాా సర్వీసు రోడ్డు కుదించుకుపోయి.. సమీప కాలనీ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. పిల్​లోపాటు మరో రెండు అప్పీళ్లుపై ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరపున న్యాయవాది పిఎస్ఆర్ ఆంజనేయులు వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్​హచ్​ఏఐ(NHAI) వ్యవహరిస్తోందన్నారు. స్థానిక ప్రజల పరిస్థితిని పరిగణనలోకి తీసుకోలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

ఎన్​హెచ్​ఏఐ(NHAI) తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి స్థలం ఇస్తే 5.3 మీటరు వెడల్పుతో సర్వీసు రోడ్డు వేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. బైపాస్ రహదారి సిద్ధమైతే భవిష్యత్తులో బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ల వద్ద ట్రాఫిక్ సమస్య ఉండదన్నారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details