విజయవాడ హై అలర్ట్.. అర్ధరాత్రి అందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు High alert at Vijayawada : ఆర్మీలో ప్రవేశపెట్టనున్న ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో రైల్వే శాఖ, విజయవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయవాడ రైల్వే స్టేషన్, బస్టాండ్‌తో పాటు పలు ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్‌కు అదనంగా 300 మంది పోలీసులు మోహరించారు. స్టేషన్‌తో పాటు పరిసర ప్రాంతాలు, రైల్వే ట్రాక్‌ల వెంబడి పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. టికెట్లు ఉన్నవారినే స్టేషన్‌లోకి అనుమతిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్న ఉన్నతాధికారులు.. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెంచారు. రైల్వే స్టేషన్ అన్ని గేట్ల వద్ద అదనపు బందోబస్తును ఏర్పాటు చేశారు.
యువకులు, విద్యార్థులు ఆందోళనకు దిగొద్దని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా సూచించారు. యువతపై కేసు నమోదైతే ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని వివరించారు. పిల్లలకు ఇలాంటి ఆలోచనలుంటే తల్లిదండ్రులు నచ్చజెప్పాలని సీపీ సూచించారు.
అర్ధరాత్రి అరెస్టు : అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ విజయవాడలో డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నిరసన చేపట్టారు. ఆందోళన చేసిన విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని అర్ధరాత్రి ఒంటిగంటకు ఇబ్రహీంపట్నం, కంచికచర్ల పీఎస్‌లకు తరలించారు. అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థి, యువజన నాయకులను విడుదల చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. పోలీసులు తీరును ప్రశ్నించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు, ఆండ్ర మాల్యాద్రి, ఇతర 20 మంది ప్రజా సంఘాల నాయకులను నిన్నరాత్రి విజయవాడలో పోలీసులు అదుపులోకి తీసుకుని కంచికచర్లలోని రూరల్ సర్కిల్ కార్యాలయానికి తరలించారు.
కంచికచర్లలో రూరల్ సర్కిల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న అర్ధరాత్రి అరెస్టు చేసిన సీపీఎం, ప్రజాసంఘాల నాయకులను పరామర్శించేందుకు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు పీ మధు, వైవీ ఇతర నాయకులు కంచికచర్ల పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చారు. పోలీసులు వారిని లోపలికి అనుమతించకపోవటంతో.. అందోళనకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు పి. మధు, వైవీ ఇతర నాయకులను అదుపులోకి తీసుకుని వీరులపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: