ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Agnipath Agitation : తెలంగాణలో విధ్వంసం.. ఏపీ రైల్వే స్టేషన్లలో హై అలర్ట్ - Violent protest breaks out at Secunderabad Railway Station

High Alerts at Railway stations: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో ఆందోళనల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించారు. అన్ని రైల్వే స్టేషన్​లలో అదనపు బలగాలు మోహరించాయి. మరోవైపు.. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే రైళ్లను హైదరాబాద్​ శివారు ప్రాంతాల వరకే నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

High Alert at Vijayawada railway station
High Alert at Vijayawada railway station

By

Published : Jun 17, 2022, 12:30 PM IST

Updated : Jun 17, 2022, 7:59 PM IST

ఏపీ రైల్వే స్టేషన్లలో హై అలర్ట్

Violent Protest over Agnipath scheme at Secunderabad Railway Station: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్‌లలో నిరసనలు మిన్నంటిన వేళ.... రాష్ట్రంలోని ప్రధాన స్టేషన్‌లలోనూ భద్రతను పెంచారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో హైఅలర్ట్‌ ప్రకటించిన రైల్వే పోలీసులు...అదనపు బలగాలను మోహరించారు. నగర సీపీ కాంతిరాణా టాటా, ఆర్ఫీఎఫ్ అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌ జి. మధుసూధనరావు, ఇతర రైల్వే అధికారులు పరిస్థితిని పర్యవేక్షించారు. ఆర్పీఎఫ్‌, జీఆర్పీతో పాటు స్థానిక పోలీసులతో స్టేషన్‌లో బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ సహా పరిసర ప్రాంతాల్లోని అన్ని స్టేషన్లలోనూ పటిష్ట భద్రత, నిఘా పెట్టారు. టికెట్‌ ఉన్న ప్రయాణికులను మాత్రమే స్టేషన్లలోకి అనుమతిస్తున్నట్లు తెలిపారు. అనుమానాస్పదంగా ఉన్న వారిని గుర్తించేందుకు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విజయవాడవ్యాప్తంగా నిరంతరం సెక్షన్‌ 30అమల్లో ఉంటుందని, రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో ఎక్కువ మంది గుమికూడదన్నారు.

గుంటూరు, నరసరావుపేట, బాపట్ల రైల్వే స్టేషన్లలోనూ...ఆర్పీఎఫ్‌, జీఆర్పీఎఫ్‌ బలగాలను మోహరించారు. ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే నియంత్రించేందుకు వీలుగా పోలీసుశాఖకు సమాచారం ఇచ్చారు. స్టేషన్‌లలోకి వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గుంటూరు నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్లే రైళ్లను నగరం వెలుపలి వరకూ మాత్రమే నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. రేపల్లె-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి వరకు మాత్రమే నడుపుతున్నట్లు తెలిపారు.

తిరుపతి రైల్వేస్టేషన్‌లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి స్టేషన్‌ను పరిశీలించి బందోబస్తుపై అధికారులకు సూచనలు చేశారు. మిగిలిన కేంద్రప్రభుత్వ రంగ సంస్థల వద్ద భద్రతను పెంచామని తెలిపారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థి సంఘాల నాయకులపై నిఘా ఉంచామన్నారు. తిరుపతి, రేణిగుంట, పాకాల, గూడూరు స్టేషన్లకూ భద్రత పెంచామని తెలిపారు.

Agnipath Agitation:విశాఖ రైల్వేస్టేషన్‌ అధికారులూ అప్రమత్తమయ్యారు. వాల్తేర్ డీఆర్‌ఎం అనూప్‌ కుమార్‌ సతపతి డివిజన్‌లోని స్టేషన్‌ల అధికార్లతో సమీక్ష నిర్వహించారు. అన్ని స్టేషన్లు, రైల్వే క్వార్టర్స్‌లలో భద్రత, నిఘా పెంపునకు ఆదేశించారు. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని అధికారులతోనూ సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపారు. కడప స్టేషన్‌లో అదనపు బలగాలను మోహరించారు. స్థానిక, జీఆర్పీ, స్పెషల్‌ పార్టీ పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. నంద్యాల జంక్షన్‌తో పాటు కర్నూలు జిల్లా ఆదోని రైల్వేస్టేషన్‌లలోనూ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 17, 2022, 7:59 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details