ప్రార్థన, భక్తి పేర్లతో రాష్ట్రంలో జరుగుతున్న హత్యలను.. ప్రభుత్వం నిరోధించాలని విజయవాడలో జరిగిన సమావేశంలో హేతువాద సంఘం డిమాండ్ చేసింది. మదనపల్లిలో ఇద్దరు యువతుల హత్య వెనుక దాగి ఉన్న భక్తి ఉన్మాదానికి కారకులెవరో.. ప్రభుత్వం నిగ్గు తేల్చాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటసుబ్బయ్య కోరారు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తమ పిల్లలను.. పురుషోత్తమనాయుడు అత్యంత కిరాతకంగా చంపి.. మరలా బ్రతుకుతారని చెప్పారంటే.. ఎంత ఉన్మాదం దాగుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.
'ప్రార్థన, భక్తి పేర్లతో జరిగే హత్యలను ప్రభుత్వం నిరోధించాలి' - hethuvaadha sangam news one
రాష్ట్రంలో ప్రార్థన, భక్తి పేర్లతో జరిగే హత్యలను అరికట్టాలని హేతువాద సంఘం.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ తరహా ఉన్మాదాలు ప్రమాదకరమని హేతువాద సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు నార్నె వెంకటసుబ్బయ్య అన్నారు. ఇటువంటి చర్యలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని.. విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో పేర్కొన్నారు.
'ప్రార్ధన, భక్తి పేర్లతో జరిగే హత్యలను ప్రభుత్వం నిరోధించాలి'
తూర్పుగోదావరి జిల్లాలో మూడు సంవత్సరాల కిందట ఏసుప్రభువు పిలుస్తున్నాడంటూ.. ముగ్గురు మహిళలు ఉరేసుకుని చనిపోయారని గుర్తుచేశారు. అలాగే దిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మోక్షం కోసం ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. స్వామీజీల కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరవుతూ.. మూఢ విశ్వాసాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం సబబు కాదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ తరహా ఉన్మాదాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని కోరారు.