ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల విక్రయం, ధరలు, షోలపై సర్కారు కొత్త చట్టం తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఆచితూచి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత(transparency) కోసం ఆన్లైన్ టికెటింగ్ బిల్లు ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం అని చిరంజీవి (hero-chiranjeevi opinion-ap-cinema-ticket) అన్నారు. అదే సమయంలో టికెట్ ధరలపై తన అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు.
థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు దెరువు కోసం టికెట్ ధరలను సవరిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా, కాలానుగుణంగా నిర్ణయిస్తే బాగుంటుందని కూడా పేర్కొన్నారు.
దేశమంతా ఒకటే జీఎస్టీ అమలు అవుతున్నప్పుడు, టికెట్ ధరలలోనూ వెసులు బాటు ఉండాలని కోరారు. అంతేకాదు.. ఇలా టికెట్ ధరల్లో వెసులు బాటు ఉంటేనే తెలుగు సినీ పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుందని అన్నారు.
ఇదీ చదవండి: Online Cinema Tickets: ఆన్లైన్లోనే సినిమా టికెట్లు.. మాకు ఆ ఉద్దేశం లేదు: మంత్రి పేర్ని