ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హెచ్​సీయూలో పీహెచ్​డీ విద్యార్థిని మృతి - phd student died

హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీలో పీహెచ్​డీ చదువుతున్న ఓ విద్యార్థిని స్నానాలగదిలో జారిపడి తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.

పీహెచ్​డీ విద్యార్థిని మృతి

By

Published : Jul 22, 2019, 7:10 PM IST

హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విద్యార్థిని యూనివర్సిటీలో పీహెచ్​డీ చదువుతున్న దీపికగా గుర్తించారు. వసతి గృహంలోని స్నానాల గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గుర్తించిన ఆమె స్నేహితులు యాజమాన్యానికి తెలిపారు. హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె నరాల సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details