ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Godavari: ఎస్సారెస్పీకి జలకళ.. ప్రాణహితకు పెరుగుతున్న ప్రవాహం

ఇటీవల కురిసిన వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. ఎగువన కురుస్తున్న వానలతో గోదావరి(Godavari) నదిపై ఉన్న బ్యారేజీ గేట్లు తెరిచారు. దీనివల్ల నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(SRSP)కు ప్రవాహం పెరుగుతోంది.

Godavari
GodavariGodavari

By

Published : Jun 17, 2021, 11:33 AM IST

వర్షాలతో గోదావరి(Godavari) పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు గోదావరి(Godavari) నదిపై ఉన్న బ్యారేజీల గేట్లు తెరవడంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు(SRSP)కు ప్రవాహం పెరుగుతోంది. బాబ్లీ ఎగువన వరద వస్తుండటంతో జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం నాటికి ఎస్సారెస్పీకి 16,886 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.

ప్రస్తుతం ఈ జలాశయంలో 19.47 టీఎంసీల జలాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మొదటి బ్యారేజీ మేడిగడ్డ ఎగువన ప్రాణహిత నదిలో ప్రవాహం పెరుగుతోంది. దీంతో కాళేశ్వరం పుష్కరఘాట్ల వద్ద రోజూ ఉండే నీటి మట్టం 4 మీటర్ల నుంచి 5.54 మీటర్లకు పెరిగింది. కృష్ణా పరీవాహకంలోని ప్రవాహంలో మార్పులు లేవు. శ్రీశైలం జలాశయానికి 7 వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహం వచ్చి చేరుతోంది.

ABOUT THE AUTHOR

...view details