ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జనాలతో కిటకిటలాడిన విజయవాడ రైల్వేస్టేషన్​ - విజయవాడ రైల్వేస్టేషన్​లో పెరిగిన జనసంచారం తాజా వార్తలు

లాక్​డౌన్​ సడలింపు వల్ల విజయవాడ రైల్వేస్టేషన్​ జనాలతో కిక్కిరిసిపోయింది. ప్లాట్​ఫాం మీద ప్రయాణికులు పెరగటం వల్ల అధికారులు వారిని నియంత్రించలేకపోయారు. థర్మల్​ స్క్రీనింగ్​ నిర్వహించి, మాస్కులు ఉన్నవారినే రైలులోకి అనుమతించారు.

heavy rush in vijayawada railway station due to lockdown effect
జనాలతో కక్కిరిసిన బెజవాడ రైల్వేస్టేషన్​

By

Published : Jun 2, 2020, 3:37 AM IST

విజయవాడ రైల్వే స్టేషన్ మీదుగా రైళ్ల రాకపోకలు ప్రారంభమవటంతో రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా కిటకిటలాడింది. స్టేషన్ పరిసర ప్రాంతాలన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. ప్లాట్​ఫాం మీద ప్రయాణికులు ఎక్కువ మంది చేరడం వల్ల భౌతిక దూరం పాటించడం కష్టమైంది. వీరిని నియంత్రించేందుకు అధికారులకు సాధ్యపడలేదు. రైలు వచ్చినపుడు స్వల్ప తోపులాట జరిగింది. రైలు టికెట్ కొన్న వారిని మాత్రమే అధికారులు ముందస్తుగా స్క్రీనింగ్ పరీక్షలు చేసి, మాస్కులు ఉన్నవారినే లోపలికి పంపారు. ప్రయాణికుల తాకిడి పెరగటంతో రైల్వేస్టేషన్​లో పోలీసు సిబ్బందిని పెంచారు.

జనాలతో కక్కిరిసిన బెజవాడ రైల్వేస్టేషన్​

ABOUT THE AUTHOR

...view details