అశ్వయుజ మాసం ఆఖరి ఆదివారం కావడంతో.. ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. ఘాట్ రోడ్డుతో పాటు కనకదుర్గనగర్ కూడా భక్తులతో సందడిగా మారింది. ఓం టర్నింగ్ వరకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఉచిత దర్శనం క్యూలైన్లతో పాటు వంద రూపాయలు, 300 రూపాయల లైన్లు సైతం భక్తులతో కిటకిటలాడాయి. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి మహానివేదన సమయం కావడంతో... భక్తులు వేచి ఉండాల్సి వచ్చింది.
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు - ఇంద్రకీలాద్రి వార్తలు
వారాంతం కావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. దసరా ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకోలేని భక్తులు... అశ్వయుజ మాసం ఆఖరి ఆదివారం కావడంతో జగన్మాత సేవలో పాల్గొనేందుకు తరలివచ్చారు.
heavy rush in indrakiladri temple