రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రాష్ట్రంలోని 7 జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. చాలా చోట్ల వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రహదారులపై భారీగా వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట పొలాల్లోకి వరద నీరి పంట నష్టం వాటిల్లింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయి కొన్ని గ్రామాలు అంధకారంలో వెళ్లాయి. ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆరుగురు గల్లంతయ్యారు, ఒక విద్యార్థి చనిపోయాడు. ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
కర్నూలు జిల్లాను కమ్మేసింది...
కర్నూలు జిల్లాలోని కుందూనది ఉద్ధృతంగా ప్రవాహిస్తుంది. నీటి ప్రవాహనికి నదిపై వంతెన మునిగింది. చామ కాలువతోపాటు మద్దులేరు వాగులో నీటి మట్టం పెరగటంతో సమీప గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. నల్లమల్లో కురిసిన భారీ వర్షాలకు మహానంది వద్ద పాలేరు వాగు పొంగుతోంది. మహానంది వ్యవసాయ కళాశాల, ఉద్యాన పరిశోధన కేంద్రంలోకి భారీగా వర్షపు నీరు వచ్చే చేరింది. కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని... పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అప్రమత్తంగా ఉండాలని నిర్దేశించారు.
కడప జిల్లాలో కుండపోత
కడపలో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షానికి నగరం మొత్తం నీటమునిగింది. నగరంలోని రహదారులపై మోకాళ్ల లోతు వర్షపు నీరు చేరింది. వర్షం కారణంగా కమలాపురం-ఖాజీపేట ప్రధాన రహదారి మూతపడింది. పాగేరు వంక వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో చుట్టు పక్కల 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోడూరు మండలంలోని అంకనగొడిగెనూరు చెరువుకు గండి పడటంతో..పూడ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. లోయర్ సగిలేరు ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరదనీటితో పూర్తిస్థాయిలో గేట్లు ఎత్తేందుకు అధికారులు యత్నిస్తున్నారు.
జిల్లాలోని మాండవ్య నది, పాపాగ్ని, పెన్నా, చెయ్యరు, బాహుదా, కుందూ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వెలిగల్లు, ఝరికోన, పిచ్ఛా, శ్రీనివాసపురం రిజర్వాయర్, మైలవరం, గండికోట ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతుంది. నదుల నుంచి దిగువ ప్రవహిస్తున్న నీరంతా నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టుకు చేరడంతో ముంపు గ్రామాలలోకి వరద నీరు వచ్చి ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ప్రకాశం జిల్లాలో భారీ వాన
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో రహదారుల జలమయమ్యయాయి. పలు చోట్ల విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నల్లమలలో కురిసిన వర్షానికి సాగిలేరు నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. గండ్లకమ్మవాగు ఉద్ధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. గుండ్లకమ్మ నది వరద ప్రవాహంలో ట్రాక్టర్ కొట్టుకుపోగా...ఇద్దరు రైతు కూలీలు ఈదుకుంటూ వచ్చి సురక్షితంగా బయటపడ్డారు. వరినాట్లు వేసుకునేందుకు తెచ్చుకున్న వరి నారు వాగులో కొట్టుకు పోయాయి. సబ్జా తదితర పంటలు కోతకు వచ్చి ఉండగా... రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. బల్లికురవ మండలం అంబడిపూడి వద్ద తూర్పువాగు ఉద్ధృతికి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. స్థానికులు ఒకరిని కాపాడగా...మరో విద్యార్థి చనిపోయాడు.
పశ్చిమగోదావరి జిల్లాలో జోరు వాన