ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కోస్తాలో భారీ వర్షాలు...పొంగిపొర్లిన వాగులు,వంకలు !

కోస్తాలో భారీ వర్షాలు కురిశాయి. గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలోనూ ఎడతెరపి లేకుండా కురిసిన వానకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

కోస్తాలో భారీ వర్షాలు...పొంగిపొర్లిన వాగులు,వంకలు !
కోస్తాలో భారీ వర్షాలు...పొంగిపొర్లిన వాగులు,వంకలు !

By

Published : Jul 14, 2020, 6:40 AM IST

కోస్తాలో భారీ వర్షాలు

విజయవాడలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటకు పైగా కురిసిన వర్షానికి చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. తిరువూరులో భారీ వర్షానికి ఆర్టీసీ బస్టాండ్‌లోకి వరద నీరు వచ్చి చేరింది. మోకాలిలోతు వరకు నీరు చేరడంతో సిబ్బంది అవస్థలు పడ్డారు. తిరువూరు బైపాస్ రోడ్డు రింగ్ వద్ద ప్రధాన రహదారిపైకి పెద్దఎత్తున వరద నీరు చేరింది. వైకాపా నియోజకవర్గ కార్యాలయంలోకి రెండు అడుగుల మేర వరదనీరు నిలిచిపోయింది. తిరువూరు మండలం రోలుపడి శివారులోని రాజీవ్ నగర్‌లో 25 ఇళ్లు ముంపునకు గురికాగా...ఒక ఇల్లు కూలిపోయింది. ముందు జాగ్రత్తగా అధికారులు స్థానికులను పాఠశాలలోకి తరలించారు.

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో భారీ వర్షం కురిసింది. వీధుల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. వార్డు సచివాలయం, ప్రభుత్వ భవనాల్లో నీరు నిలిచిపోయింది. మురుగు కాల్వలు శుభ్రం చేయకపోవడం వల్లే నీరు నిలిచిపోయిందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

తూర్పుగోదావరి జిల్లాల్లోనూ వివిధ చోట్ల భారీ వర్షం కురిసింది. మన్యంతో పాటు రాజమహేంద్రవరం, కాకినాడ, కోనసీమ, మెట్ట ప్రాంతాల్లోనూ వాన కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జిల్లాలో పల్లపు ప్రాంతాల్లో వరి నారుమడులు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీచదవండి

భారీగా నమూనాల సేకరణ...ఫలితం కోసం తప్పని నిరీక్షణ !

ABOUT THE AUTHOR

...view details