వచ్చే నాలుగైదు గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు.
రాష్ట్రంలో వచ్చే నాలుగైదు గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు - ఏపీలో వర్షాల వార్తలు
వచ్చే నాలుగైదు గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు.
వచ్చే నాలుగైదు గంటల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు