ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హై'జల్​'బాద్‌.. జల దిగ్బంధంలోనే భాగ్యనగరం - హైదరాబాద్ వర్షాలు న్యూస్

కాప్రాయ చెరువు నిండి హరిహరపురకాలనీ నీటమునక
కాప్రాయ చెరువు నిండి హరిహరపురకాలనీ నీటమునక

By

Published : Oct 14, 2020, 1:22 AM IST

Updated : Oct 14, 2020, 3:35 PM IST

15:28 October 14

అంబర్‌పేటలో మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ పర్యటన

  • హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరద ప్రవాహం
  • హుస్సేన్‌సాగర్‌ నిండిపోయి పొంగిపొర్లుతున్న వరద
  • భారీ వరద వల్ల ట్యాంక్‌బండ్ దిగువన ఉన్న ప్రజల్లో భయాందోళన
  • హుస్సేన్‌సాగర్‌ వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న అధికారులు
  • హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతవాసులను అప్రమత్తం చేసిన అధికారులు

అంబర్‌పేటలో మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ పర్యటన

  • హైదరాబాద్‌: అంబర్‌పేటలో మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ పర్యటన
  • రామంతాపూర్ చెరువు, హబ్సిగూడ ప్రాంతాలను పరిశీలించిన మంత్రులు
  • బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన మంత్రి కేటీఆర్
  • సహాయక చర్యల్లో పాల్గొనాలని కార్పొరేటర్లను సూచించిన ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి

జంట జలాశయాల్లోకి భారీగా వరద

  • హైదరాబాద్‌: జంట జలాశయాల్లోకి భారీగా వరద
  • హిమాయత్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో 19,100 క్యూసెక్కులు
  • హిమాయత్‌సాగర్ 11 గేట్లు ఎత్తి 22 వేల క్యూసెక్కులు మూసీలోకి విడుదల
  • హిమాయత్‌సాగర్‌లో ప్రస్తుతం 1762. 86 అడుగుల నీటిమట్టం ఉస్మాన్ సాగర్ జలాశయానికి భారీగా వరద ప్రవాహం 
  • హైదరాబాద్‌: ఉస్మాన్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో 20,833 క్యూసెక్కులు
  • ఉస్మాన్‌సాగర్‌లో ప్రస్తుతం 1779. 50 అడుగుల నీటిమట్టం

నీట మునిగిన పురాతన శివాలయం

  • హైదరాబాద్‌: చైతన్యపురిలో నీట మునిగిన పురాతన శివాలయం
  • చైతన్యపురిలో నీటమునిగిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం
  • రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన ఆలయాలు

రహదారిపై భారీగా చేరిన వరద నీరు

  • హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ ప్రధాన రహదారిపై భారీగా చేరిన వరద నీరు
  • భారీగా వరద నీరు చేరికతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం
  • వరద నీరు వల్ల కరీంనగర్ నుంచి పేషెంట్‌ను తీసుకొస్తున్న అంబులెన్స్‌ నిలిపివేత
  • అంబులెన్సు అక్కడే నిలిపి స్ట్రెచర్‌పై పేషంట్‌ను కొత్తపేట ఓమ్ని ఆసుపత్రికి తరలింపు

వరద ప్రవాహం

  • సికింద్రాబాద్: బోయిన్‌పల్లి పరిధిలో వరద ప్రవాహం
  • సీతారాంపురం, సౌజన్యకాలనీల్లోకి చేరిన వరద ప్రవాహం
  • వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన పలు వాహనాలు

మంత్రి కేటీఆర్ పర్యటన

  • ఎల్‌బీనగర్‌ బైరామల్‌గూడలో మంత్రి కేటీఆర్ పర్యటన
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేటీఆర్‌
  • హోంమంత్రి, సీఎస్‌, డీజీపీతో కలిసి బైరామల్‌గూడలో పర్యటన
  • వరద ప్రాంతాల్లోని పరిస్థితులను పర్యవేక్షిస్తున్న కేటీఆర్
  • నీరు త్వరగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
  • ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్లకు సూచనలు చేసిన కేటీఆర్‌
  • బైరామల్‌గూడ కాలనీ సమస్యలపై ప్రజలతో మాట్లాడిన కేటీఆర్
  • తమ సమస్యలను మంత్రి కేటీఆర్‌కు వివరిస్తున్న ప్రజలు
  • శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రి కేటీఆర్‌ను కోరిన స్థానికులు
  • ముంపునకు గురైన ఓ నివాసంలోకి వెళ్లి బాధితులను పరిశీలించిన కేటీఆర్‌
  • నిజాంపేట్ పరిధిలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద కూలిన గోడ
  • 30 అడుగుల గోడ కూలి పక్కన ఉన్న భవనాలపై పడిన పెచ్చులు
  • పక్కన ఉన్న భవనంలో 2 ప్లాట్లు, రెండు కార్లు ద్విచక్రవాహనాలు ధ్వంసం

13:23 October 14

నీరు తగ్గే వరకు ఈ మార్గంలో వాహనరాకపోకలు నిషేధం : హైదరాబాద్‌ ట్రాఫిక్‌ ఏసీపీ అనిల్‌కుమార్‌

  • కర్నూల్ నుంచి షాద్‌నగర్‌ వైపు వెళ్లే వాహనాలు ఓఆర్‌ఆర్‌ను ఎంచుకోవాలి
  • పీవీఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ మార్గాన్ని ఉపయోగించరాదు
  • మెహదీపట్నం నుంచి గచిబౌలి వెళ్లే వాహనదారులు సెవెన్‌ టోంబ్స్‌ దారిని ఎంచుకోవాలి
  • గచ్చిబౌలి నుంచి వచ్చే వాహనాలు మెహదీపట్నం, షేక్‌పేట్, సెనార్ వ్యాలీ మార్గంలో వెళ్లాలి
  • గచ్చిబౌలి నుంచి వచ్చే వాహనాలు బంజారా హిల్స్‌ రోడ్ నంబర్ 12 ద్వారా వెళ్లాలి
  • పురాణాపూల్ వద్ద 100 అడుగుల రహదారి పూర్తిగా మూసివేయబడింది
  • పురాణాపూల్‌ దారికి ప్రత్యామ్నాయంగా కార్వాన్ వైపు దారి మళ్లింపు
  • చాధర్‌ఘాట్ నుంచి వచ్చే వాహనాలు నింబోలిఅడ్డా, గోల్నాక మీదుగా ఉప్పల్ వైపు దారి మళ్లింపు
  • అలీ కేఫ్-అంబర్‌పేట్ మార్గంలో మూసారంబాగ్ ఆర్‌టీఏ ఆఫీస్ వంతెన మూసివేత
  • ఈ మార్గాల్లో వెళ్లాల్సిన ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి
  • మలక్‌పేట్ - ఎల్బీనగర్‌ రహదారి పూర్తిగా నిషేధించడమైంది
  • వర్షాల కారణంగా ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి పూర్తిగా మూసివేత
  • ఈ మార్గాల్లో వెళ్లాల్సిన ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి
     

10:10 October 14

నెహ్రు జూలాజికల్ పార్క్ మూసివేత

నెహ్రు జూలాజికల్ పార్క్ మూసివేత
నెహ్రు జూలాజికల్ పార్కులో సఫారీ పార్క్ సహా మరికొన్ని స్థలాల్లో చేరిన వరద నీరు 

వరద నీరు చేరిక కారణంగా జూపార్కు మూసివేస్తున్నట్లు ప్రకటించిన నిర్వాహకులు

10:09 October 14

మాదాపూర్‌ శిల్పారామంలో నేలకూలిన భారీ వృక్షాలు

మాదాపూర్‌ శిల్పారామంలో నేలకూలిన భారీ వృక్షాలు

ఇవాళ శిల్పారామం మూసివేస్తున్నట్లు ప్రకటించిన నిర్వాహకులు 

ఉప్పల్​ శిల్లారామంలోనూ...

ఉప్పల్‌ శిల్పారామంలోనూ చేరిన వరద నీరు

ఉప్పల్‌ శిల్పారామంలో వరద ప్రవాహంతో కూలిన చెట్లు

ఉప్పల్‌ శిల్పారామం ఇవాళ మూసివేస్తున్నట్లు ప్రకటించిన నిర్వాహకులు

09:42 October 14

హైదరాబాద్‌లో విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం

హైదరాబాద్‌లో విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం
ఆన్‌లైన్‌ తరగతులకు సెలవులు ప్రకటించిన విద్యాసంస్థలు
వరదనీటి ఉద్ధృతికి హైదరాబాద్‌తో కలిసే హైవేలు పలుచోట్ల ధ్వంసం
నిన్న కురిసిన వర్షానికి పలుచోట్ల ఇంకా రోడ్డుపైనే వాననీరు

08:11 October 14

ఎడతెరిపిలేని వర్షాలతో తడిసి ముద్దయిన భాగ్యనగరం

ఎడతెరిపిలేని వర్షాలతో తడిసి ముద్దయిన భాగ్యనగరం
ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లో ఇంకా తగ్గని వరద ఉద్ధృతి
ఇంకా జల దిగ్భంధంలోనే లోతట్టు ప్రాంతాలు
ఖైరతాబాద్, చింతల్‌బస్తీలో భారీగా నిలిచిన వరద నీరు

గాంధీనగర్‌, మారుతీనగర్‌లో భారీగా నిలిచిన వరద నీరు

శ్రీనగర్‌కాలనీ, ఆనంద్‌నగర్‌లో భారీగా నిలిచిన వరద నీరు
ముంపుతో తీవ్ర ఇబ్బందులు పడుతోన్న నగరవాసులు

07:44 October 14

కాప్రాయ చెరువు నిండి హరిహరపురకాలనీ నీటమునక

కాప్రాయ చెరువు నిండి హరిహరపురకాలనీ నీటమునక

వరద నీరు చేరికతో నీట మునిగిన ఇళ్లు
బి.ఎన్‌.రెడ్డి గాంధీనగర్‌లో పి.వి.ఆర్ కాలనీ, గౌతమీనగర్‌లో ఇళ్లలోకి చేరిన నీరు
హయత్‌నగర్‌లోని శారదానగర్‌, సామనగర్‌లో ఇళ్లలోకి చేరిన వరద
కాప్రాయ చెరువు కట్టకు పొంచి ఉన్న ముప్పు
చింతల్‌కుంట రేడియోస్టేషన్ గోడ కూలి జనప్రియహోమ్స్ ఇళ్లలోకి చేరిన నీరు

07:44 October 14

నాగోల్ ఆదర్శనగర్‌కాలనీలో వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్న ద్విచక్ర వాహనాలు

07:43 October 14

శంషాబాద్‌: గగన్‌పహడ్‌ వద్ద జాతీయరహదారిపైకి చేరిన నీరు

శంషాబాద్‌: గగన్‌పహడ్‌ వద్ద జాతీయరహదారిపైకి చేరిన నీరు

శంషాబాద్‌: వరద ఉద్ధృతికి కోతకు గురైన జాతీయరహదారి

వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయిన నలుగురు గల్లంతు, ఇద్దరు మృతి

పక్కనే ఉన్న పల్లెచెరువు కట్ట తెగి జాతీయరహదారిపైకి చేరిన నీరు

07:42 October 14

హిమాయత్‌సాగర్‌లో పూర్తిస్థాయికి చేరిన నీటిమట్టం

హిమాయత్‌సాగర్‌లో పూర్తిస్థాయికి చేరిన నీటిమట్టం
ప్రస్తుతం 1763.50 అడుగుల పూర్తిస్థాయికి చేరిన నీటిమట్టం
హిమయత్‌సాగర్‌లోకి వస్తున్న 17500 క్యూసెక్కుల నీరు
హిమాయత్‌సాగర్ 4 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల

06:28 October 14

హైదరాబాద్‌లో వందేళ్లలో రెండో అత్యధిక వర్షపాతం నమోదు

హైదరాబాద్‌లో వందేళ్లలో రెండో అత్యధిక వర్షపాతం నమోదు

జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో రికార్డుస్థాయి వర్షపాతం

హైదరాబాద్‌లో చాలాచోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు

అత్యధికంగా ఘట్‌కేసర్‌ సింగపూర్‌ టౌన్‌షిప్‌లో 32.3 సెం.మీ వర్షపాతం

హయత్‌నగర్‌లో 29.8, హస్తినాపురంలో 28.4 సెం.మీ వర్షపాతం

అబ్దుల్లాపూర్‌మెట్‌లో 26.6, ఇబ్రహీంపట్నంలో 25.7 సెం.మీ వర్షపాతం

సరూర్‌నగర్‌లో 27.35, ఉప్పల్‌లో 25.6 సెం.మీ వర్షపాతం నమోదు

ముషీరాబాద్‌లో 25.6 సెం.మీ, బండ్లగూడలో 23.9 సెం.మీ వర్షపాతం

మేడిపల్లిలో 24.2 సెం.మీ, బాలానగర్‌లో 23.1 సెం.మీ వర్షపాతం 

సికింద్రాబాద్‌లో 23.2 సెం.మీ, మల్కాజ్‌గిరిలో 22.6 సెం.మీ వర్షపాతం

05:14 October 14

జంటనగరాల్లో పూర్తిగా స్తంభించిన జనజీవనం

జంటనగరాల్లో పూర్తిగా స్తంభించిన జనజీవనం

జంటనగరాల్లో 1500 కాలనీలు జలదిగ్బంధం

హైదరాబాద్‌లో పలుచోట్ల రోడ్లపై నడుము లోతు వరకు వర్షపు నీరు

వరద నీటిలో కొట్టుకుపోయిన కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు 

హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారిపైకి భారీగా వరద నీరు 

వర్షాల కారణంగా రహదారికి అడ్డంగా నేలకొరిగిన భారీ చెట్లు

హైదరాబాద్‌: వివిధ ప్రాంతాల్లో చెట్లు కూలి తెగిపడిన విద్యుత్‌ తీగలు

భారీ వర్షాలు, వరదలకు హైదరాబాద్‌లో పలు ప్రాంతాలు నీటమునక

హైదరాబాద్‌లో భారీ వర్షాలు, వరదలకు పొంగుతున్న నాలాలు 

హైదరాబాద్‌లో చెరువులను తలపిస్తున్న వీధులు, కాలనీలు

హైదరాబాద్‌లో భారీ వర్షాల వల్ల రోడ్లపై బోట్లలో సహాయ చర్యలు

పురాతన ఇళ్లలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు

సహాయ చర్యల్లో జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌, విపత్తు నిర్వహణశాఖ సిబ్బంది

01:42 October 14

హైదరాబాద్‌వ్యాప్తంగా కుంభవృష్టి

జంటనగరాల్లో పూర్తిగా స్తంభించిన జనజీవనం

జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో రికార్డుస్థాయి వర్షపాతం

హైదరాబాద్‌లో చాలాచోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు

అత్యధికంగా ఘట్‌కేసర్‌ సింగపూర్‌ టౌన్‌షిప్‌లో 31.9 సెం.మీ వర్షపాతం

హయత్‌నగర్‌లో 29.13, హస్తినాపురంలో 27.93 సెం.మీ వర్షపాతం

అబ్దుల్లాపూర్‌మెట్‌లో 26.15, ఇబ్రహీంపట్నంలో 25.35 సెం.మీ వర్షపాతం

సరూర్‌నగర్‌లో 26.78, ఉప్పల్‌లో 24.8 సెం.మీ వర్షపాతం నమోదు

దండుమైలారంలో 24.40, మేడిపల్లిలో 23.2, కీసరలో 25.6 సెం.మీ వర్షపాతం

ముషీరాబాద్‌లో 24.5 సెం.మీ, చార్మినార్‌లో 21.6 సెం.మీ వర్షపాతం 

మల్కాజ్‌గిరిలో 21.6 సెం.మీ, సికింద్రాబాద్‌లో 21.5 సెం.మీ వర్షపాతం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో 25.5 సెం.మీ వర్షపాతం

01:25 October 14

సబ్‌స్టేషన్లలోకి వరద

హైదరాబాద్‌లో పలు సబ్‌స్టేషన్లలోకి ప్రవేశించిన వరద నీరు

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

నిమ్స్, కందికల్ గేట్, పెద్ద అంబర్‌పేట్, కొత్తపేట్‌ సబ్‌స్టేషన్లలోకి వరద నీరు: సీఎండీ

రంగారెడ్డి కోర్ట్, హయత్‌నగర్‌, తట్టిఅన్నారం సబ్‌స్టేషన్లలోకి వరద నీరు: సీఎండీ 

సబ్‌స్టేషన్లలోకి వరద నీరు చేరడంతో విద్యుత్ నిలిపివేశాం: సీఎండీ రఘుమారెడ్డి
ప్రజలు విద్యుత్ స్తంభాలు, తీగలు ముట్టుకోవద్దు: సీఎండీ రఘుమా రెడ్డి
విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి సంప్రదించాల్సిన నంబర్లు 1912, 100

విద్యుత్‌శాఖ కంట్రోల్ రూమ్ నంబర్లు: 73820 72104, 73820 72106, 73820 71574 


 

01:23 October 14

తెలంగాణలో వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

రాష్ట్రంలో వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగాలకు ఆదేశం

జీఎచ్‌ఎంసీ పరిధిలో 3 రోజులు ప్రజలు బయటకు రావద్దని అధికారుల విజ్ఞప్తి

అత్యవసర సేవల కోసం సంప్రదించాల్సిన నంబర్‌ 040-2111 11111

జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణశాఖ నంబరు: 90001 13667

జీహెచ్‌ఎంసీ పరిధిలో చెట్ల నరికివేత సిబ్బంది నంబరు: 63090 62583

జీహెచ్‌ఎంసీ విద్యుత్‌శాఖ నంబరు: 94408 13750

01:22 October 14

హైదరాబాద్‌: నిండుకుండలా మారిన హిమాయత్‌సాగర్

హైదరాబాద్‌: నిండుకుండలా మారిన హిమాయత్‌సాగర్ 

హైదరాబాద్: హిమాయత్‌సాగర్‌లోకి భారీగా వరద ప్రవాహం

పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరిన హిమాయత్‌సాగర్‌ జలాశయం

హిమాయత్‌సాగర్ 2 గేట్లు రెండడుగుల మేర ఎత్తి నీరు దిగువకు విడుదల

మూసీ నదిలోకి 1300 క్యూసెక్కులు వదులుతున్న అధికారులు

హిమాయత్‌సాగర్‌ దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

మూసీ పరివాహక, లోతట్టుప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

00:01 October 14

హైదరాబాద్: పాతబస్తీలో రెండు ఇళ్లు కూలి 9 మంది మృతి

హైదరాబాద్: పాతబస్తీలో రెండు ఇళ్లు కూలి 9 మంది మృతి

ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలు, ఒవైసీ ఆస్పత్రికి తరలింపు

హైదరాబాద్‌: చాంద్రాయణగుట్ట పరిధి గౌస్ నగర్‌లో విషాదం

ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఇళ్లపై బండరాళ్లు జారిపడి కూలిన గోడలు

ఘటనాస్థలి పరిశీలించిన ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, పోలీసులు

ఫలక్‌నుమా ఏసీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సహాయ చర్యలు

Last Updated : Oct 14, 2020, 3:35 PM IST

ABOUT THE AUTHOR

...view details