ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జోరుగా వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం - కృష్ణా జిల్లాలో వర్షాలు

కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మచిలీపట్నంలో భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొల్లేరులో వరద నీరు చేరి.. ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

rains at krishana district
కృష్ణా జిల్లాలో వర్షాలు

By

Published : Sep 16, 2020, 12:43 PM IST

జోరుగా వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

కృష్ణా జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షం కురుస్తోంది. మచిలీపట్నంలో ఉదయం నుంచి రెండు గంటల పాటు పడిన భారీ వర్షంతో ప్రధాన రహదారులతో పాటు పల్లపు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. మురుగు కాల్వలు సరిగా లేనందున.. నీరు పోయే పరిస్థితి లేకుండా పోయింది. ద్విచక్ర వాహన చోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల అభివృద్ధి చేసిన బస్ స్టాండ్ పరిసరాలూ నీరు చేరిన కారణంగా.. ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

కైకలూరు ప్రాంతంలోని కొల్లేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొల్లేరులో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పెనుమాకలంక పెద్ద ఎడ్ల గాడి రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. కొల్లేరు లంక గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details