ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కుండపోత వానలు... లక్షల ఎకరాల్లో మునిగిన పంటలు

తీవ్ర వాయుగుండం కోస్తాలో బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాల్ని నీట ముంచింది. లక్షన్నర ఎకరాల్లో పంట పొలాలను మింగేసింది. వాగులు, వంకలను ఏకం చేసింది. నలుగురిని బలి తీసుకుంది. మరో నలుగురు గల్లంతయ్యారు. తీర ప్రాంత జిల్లాల ప్రజలను 2 రోజులుగా వణికించిన తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర గంటల మధ్య కాకినాడ సమీపంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో తీరందాటింది. ఇది వాయుగుండంగా బలహీనపడి కుండపోత వర్షాలను కురిపిస్తోంది.

Heavy Rainfall Predicted over Andhra Pradesh
రాష్ట్రంలో కుండపోత వానలు... లక్షల్లో ఎకరాల్లో పంట మునక

By

Published : Oct 14, 2020, 5:32 AM IST

Updated : Oct 14, 2020, 7:43 AM IST

భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. జనజీవనం స్థంభించింది. ఏక ధాటిగా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతల ప్రజలు క్షణమోక యుగంలా గడిపారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉభయగోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల 20 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసింది. కృష్ణా, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ 1- సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు వానలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 146 మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ముందు జాగ్రత్తల్లో భాగంగా విశాఖ పట్నంలో 3700 మంది తూర్పుగోదావరి జిల్లాలో 978 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షాల కారణంగా డిగ్రీ విద్యార్థులకు సెమిస్టర్​ పరీక్షలకు హాజరుకాలేకపోయారు.

వరద నీటిలో కొట్టుకుపోయిన కారు.. మహిళ మృతి

విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి తిరుపతికి కారులో బయల్దేరిన ఓ కుటుంబం నాతవరం మండలం వెదుల్లుగెడ్డ వద్ద వరదలో చిక్కుకుపోయింది. ఈ ప్రమాదంలో జీ ఉమామహేశ్వరి చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు. మునగాపక మండలం చూచుకుండ గణపతి మధ్యలో రోలుగడ్డ వంతెనపై నుంచి పడి ఒకరు గల్లంతయ్యారు. మెలిపాకలో గుడిలో పూజలు చేస్తున్న వృద్దురాలు మైక్​సెట్​ ఆన్​ చేసే సమయంలో విద్యుదాఘాతానికి గురై మరణించారు. రాజమహేంద్రవరంలో గ్రామీణం బొమ్మూరులో వర్షాలకు బాత్​రూమ్ గోడకూలి లక్ష్మీ అనే మహిళ చనిపోయారు. రంపచోడవరం చినగొట్టాల రేవు వీధి వద్ద వాగులో కొట్టుకుపోతున్న మహిళను ఇద్దరు యువకులు రక్షించారు.

రాష్ట్రంలో కుండపోత వానలు

కృష్ణా జిల్లా పెదలంకకు చెందిన నవీన్​ ఇబ్రహీంపట్నం సమీపంలో ఏనుగడ్డ వాగు దాటుతూ గల్లంతయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కట్టుకాల్వలో పెంకుటిల్లు కూలి వృద్ధురాలు మృతి చెందారు. కామవరపుకోట మండలం ఆరమిల్లి సమీపంలో చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరు గల్లంతయ్యారు. విజయవాడలో కొండచెరియలు విరిగిపడి ఒకరు మరణించారు. ఆనాసాగరం వద్ద వాగులో చిక్కుకున్న అయిదుగురిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.

రాష్ట్రంలో కుండపోత వానలు

శ్రీకాకుళంజిల్లా మెలియాపుట్టి మండలం గోకర్ణపురంలో యవ్వారి శ్రీనివాసరావు వాగు దాటే సమయంలో వరద ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగి కొట్టుకుపోయారు. పాతపట్నంలో వాగులో కొట్టుకుపోతున్న ఒకరిని స్థానికులు కాపాడారు. గుంటూరు జిల్లా కంభంపాడు-పరస మధ్య రోడ్డుదాటుతుండగా వరదలో కారు కొట్టుకుపోయింది. స్థానికులు అందులోని వారిని కాపాడారు.

రాష్ట్రంలో కుండపోత వానలు

చొచ్చుకొచ్చిన వరద...

వరద ముంచెత్తడంతో తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం హోప్​ఐలాండ్​ నుంచి 70 కుంటుంబాలను , కాకినాడలోని లోతట్టు ప్రాంతం పూలే పాకల నుంచి 230 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు కాకినా సీ పోర్ట్​లోని కంపెనీలన్నీ నీట మునిగాయి. ఉప్పాడ తీరంలో కెరటాల ఉద్ధృతికి మత్స్యకారు గ్రామాల్లో పది ఇళ్లు కొట్టుకుపోయాయి. జగన్నాథపురం వంతెన వద్ద నీటి మట్టం పెరిగి చంద్రికా థియేటర్​ ప్రాంతం, ఇంద్రపాలెం అర్జుననగర్​ జలదిగ్బంధమయ్యాయి.

రాష్ట్రంలో కుండపోత వానలు

విశాఖ జిల్లా ఎలమంచిలిలో మూడు కాలనీలు మునిగిపోయాయి. పాయకరావుపేటలో తాండవ నది ఒడ్డునున్న గ్రామాల్లోకి వరదనీరు చొచ్చుకువచ్చింది. విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు , కాలనీలు జలమయమయ్యాయి. వీరుల పాడు మండలం జూజ్జూరులోకి వరదన ీరు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా సీతాపురంలో చెరువు గట్టు తెగి నివాసాల మధ్యకు చేరింది.

అంధకారంలో గ్రామాలు, పట్టణాలు...

ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్​ స్తంభాలు నేలకూలి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం 12 వరకు సరఫరా నిలిచిపోయింది. కాకినాడలో 33/11 కేవీ సబ్​స్టేషన్ నీట మునిగింది. విశాఖ జిల్లా వ్యాప్తంగానూ ఇదే పరిస్థితి నెలకొంది. కృష్ణా జిల్లా నందిగామ విద్యుత్​ సబ్​స్టేషన్​లోకి కూడా వరద నీరు వచ్చింది చేరింది. విజయనగరం, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాలోనూ తెల్లవారు జామునుంచి విద్యుత్​ సరఫరా నిలిచింది.

రాష్ట్రంలో కుండపోత వానలు

నిండుకుండల్లా జలాశయాలు

నాగార్జునసాగర్​ నుంచి వరద పెరగడంతో యంత్రాంగం పులిచింతల గేట్లు ఎత్తవేశారు. పులిచింతలకు ఎగువ నుంచి 3.28 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో పది గేట్లు ఎత్తివేసి 3.65 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అన్నవరంలో పంపా రిజర్వాయర్​లో నీటి మట్టం 102.30 అడుగులకు చేరడంతో 1800 క్యూసెక్కులను వడిచిపెట్టారు. ఏలేశ్వరంలోని ఏలేరు ప్రాజెక్టుకు ఎగువ నుంచి 23, 215 క్యూసెక్కుల వరద రావడంతో 16వేల క్యూసెక్కులను వదిలారు. విజయనగరం జిల్లా మెంటాడ, గజపతినగరం మండలాల్లో కురిసిన వర్షాలకు చంపావతికి వరద నీరు పోటెత్తింది. వేగావతికి వరద పెరగడంతో రెండు గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు.

రాష్ట్రంలో కుండపోత వానలు

విశాఖ జిల్లా తాండవ జలాశయం మూడు గేట్లు ఎత్తి 12 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని తమ్మిలేరులోకి భారీగా వరద చేరింది. విశాఖ జిల్లాలో ఆశారద, వరాహ, సర్పా, తాండవ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో చెర్వుకొమ్ముపాలెం 100 ఎకరాల చెరువు నిండి పొర్లుతుండడంతో గండి కొట్టి మరీ వరదను వదిలారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఎర్రకాలువ, జల్లేరు, తమ్మిలేరు, బైనేరు, గుండేరు, సుద్దవాగుల నిండుకుండను తలపిస్తున్నాయి. తడికలపూడి, గోపాలపురం, కొయ్యలగూడెం, పోలవరం, కొవ్వూరు మండలాల్లో వాగులు ఉద్ధడతంగా ప్రవహిస్తున్నాయి.

రాష్ట్రంలో కుండపోత వానలు

ఇదీ చూడండి

అల్పపీడనంగా కొనసాగుతున్న తీవ్రవాయుగుండం

Last Updated : Oct 14, 2020, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details