విజయవాడ విద్యాధరపురంలో కొండ చరియలు విరిగి పడి వ్యక్తి మృతిచెందాడు. నాలుగు స్తంభాల సెంటర్లో కొండచరియలు విరిగి.. నివాసాల మీద పడ్డాయి. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి మట్టిలో కూరుకుపోయాడు. భవానీపురం పోలీసులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
విజయవాడలో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగిపడి వ్యక్తి మృతి - విజయవాడలో కొండచరియలు విరిగిపడి వ్యక్తి మృతి
వాయుగుండం ప్రభావం కృష్ణా జిల్లాను అతలాకుతలం చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. విజయవాడ విద్యాధరపురంలో కొండ చరియలు విరిగి ఇళ్లపై పడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.
heavy rain in vijayawada krsina district
విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఓంకారం మలుపు వద్ద రాళ్లు రోడ్డుపైకి వచ్చి పడ్డాయి. నిన్నటి నుంచి వర్షాలు కురుస్తుండటం వల్ల... భక్తులను ఘాట్ రోడ్డు నుంచి అనుమతించలేదు.
ఇదీ చదవండి:క్రమంగా బలహీనపడుతున్న తీవ్ర వాయుగుండం