విజయవాడలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ఉదయం తొమ్మిది గంటల నుంచి ఏకధాటిగా రెండు గంటలపాటు వర్షం కురిసింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఆటోనగర్, మొగల్రాజపురం, ఇందిరాగాంధీ స్టేడియం, వన్‌టౌన్, పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మురుగునీటి కాల్వలు పొంగిపొర్లాయి. చెత్తాచెదారాలు, మురుగు అంతా రోడ్లపైకి వచ్చి నిలిచిపోయింది. వన్‌టౌన్ ప్రాంతంలో లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్లపై నిలిచిపోయిన నీటిని బయటకు పంపేందుకు నగరపాలక సంస్థ బృందాలు రంగంలోకి దిగాయి.
విజయవాడలో భారీ వర్షం... వాహన రాకపోకలకు తీవ్ర ఆటంకం - vijayawada rain latest news
విజయవాడలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు వచ్చి చేరింది. చెత్తా చెదారాలు, మురుగు నీరంతా రోడ్లపైకి వచ్చి వాహన రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.
విజయవాడలో భారీ వర్షం