బుధవారం అర్ధరాత్రి భీకర గాలులతో కూడిన వర్షం విజయవాడలో బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు నగరంలో కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. వైకాపా నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పలు చోట్ల చిరిగిపోయాయి. జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో వేదిక పైకప్పు పాక్షికంగా దెబ్బతింది. వేదికపైన వేసిన పరదాలు పూర్తిగా ఎగిరిపోయాయి. వర్షం కారణంగా మైదానమంతా బురదమయంగా మారింది. రాత్రి 1.30 గంటలకు గాలులు, వర్షం తగ్గగానే వైకాపా నేతలు, అధికారులు అక్కడికి చేరుకొని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. గాలి వేగానికి చాలాచోట్ల హోర్డింగులు కిందపడ్డాయి. రహదారుపై వాహనాలు నడపలేని పరిస్థితి ఎదురైంది. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది.
ప్రమాణ స్వీకరణ ప్రాంగణం పునరుద్ధరణ - జగన్
విజయవాడ నగరంలో గాలివాన బీభత్సం సృష్టించింది. జగన్ ప్రమాణ స్వీకారం చేసే మైదానంలో వేదిక పైకప్పు పాక్షికంగా దెబ్బతింది.
విజయవాడలో అర్థరాత్రి గాలివాన బీభత్సం