ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ - ప్రకాశం బ్యారేజీ వద్ద మెుదటి ప్రమాద హెచ్చరిక వార్తలు

కృష్ణానదికి ఎగువ నుంచి వరదనీటి ఉద్ధృతి పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. బ్యారేజీకి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5.69 లక్షల క్యుసెక్కులుగా ఉన్నాయి.

ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక
ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక

By

Published : Oct 14, 2020, 9:39 AM IST

ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి 4 లక్షల క్యూసెక్కుల రాగా.. మున్నేరు, ఇతర ప్రాంతాల నుంచి 1.6 లక్షల క్యూసెక్కులు వరద నీరు వస్తోంది. వరద ప్రవాహం చేరుతున్నప్పుడే ముందస్తుగా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని.. లోతట్టు ప్రాంత , లంకగ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని.. విపత్తులశాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు.

కృష్ణా జిల్లా అధికారులను కలెక్టర్ ఇంతియాజ్ అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ప్రజలంతా సహకరించి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కోరారు. చినలంక, పెదలంక ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. కృష్ణానది పరివాహక ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వాగులు, కాలువలు దాటేందుకు ప్రయత్నించొద్దని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details