ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడ రైల్వే స్టేషన్‌ యార్డులో భారీ మార్పులు.. తగ్గనున్న రైళ్ల నిరీక్షణ సమయం

దక్షిణ మధ్య రైల్వే భారీ ఎత్తున మార్పులు చేపట్టింది. విజయవాడ రైల్వే స్టేషన్‌ యార్డులో 32 రూట్లతో ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌ లాకింగ్‌ (ఈఐ)తో నూతన బల్బ్‌ క్యాబిన్‌ ఏర్పాటు చేసింది. దీని ద్వారా సికింద్రాబాద్‌ - విశాఖపట్నం మధ్య రైళ్ల రాకపోకల నిర్వహణలో క్రాసింగ్‌లను చాలా వరకు నివారించవచ్చని అధికారులు తెలిపారు.

changes in south central raiways
విజయవాడ రైల్వే స్టేషన్‌ యార్డులో మార్పులు

By

Published : Jul 11, 2021, 10:32 PM IST

విజయవాడ రైల్వే స్టేషన్‌ యార్డులో దక్షిణ మధ్య రైల్వే భారీ ఎత్తున మార్పులు చేపట్టింది. ఈ మార్పులు చేర్పులతో రైళ్ల నిరీక్షణ సమయం తగ్గడంతోపాటు సెక్షనల్‌ సామర్థ్యం మెరుగవుతుందని రైల్వే శాఖ వెల్లడించింది. దీంతో ప్రధానంగా సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య ఏకకాలంలో రైళ్ల రాపోకలకు సౌలభ్యం ఏర్పడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో సికింద్రాబాద్‌ - విశాఖపట్నం మార్గంలో ఒకేసారి రైళ్ల రాకపోకలు సాగించినప్పుడు రైళ్లు నిరీక్షించాల్సి వచ్చేది. దీని ప్రభావం ఇతర మార్గాల్లో వచ్చే రైళ్లపైనా పడేది. ఈ సమస్యలను అధిగమించేందుకు దక్షిణ మధ్య రైల్వే.. విజయవాడలోని ఉత్తర భాగం యార్డులో మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా 32 రూట్లతో ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ (ఈఐ)తో నూతన బల్బ్‌ క్యాబిన్‌ ఏర్పాటు చేశారు. 1.5 కి.మీ నూతన లైన్‌తో 20 రూట్లతో అనుసంధానించింది.

ప్రయోజనాలు

ప్రధానంగా సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య రైళ్ల రాకపోకల నిర్వహణలో క్రాసింగ్‌లను చాలా వరకు నివారించవచ్చు. ఏకకాలంలో రైళ్ల రవాణా సాధ్యమవుతుంది. ముఖ్యంగా.. సికింద్రాబాద్‌ - విశాఖపట్నం, విజయవాడ - విశాఖపట్నం మధ్య రైళ్ల నిర్వహణలో రైళ్ల నిరీక్షణను అధిగమించవచ్చని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

ap fibernet: ఏపీ ఫైబర్‌నెట్‌లో అక్రమాల ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details