ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Heart Surgery: హార్ట్‌ ఫెయిల్‌.. ఏఐజీ వైద్యుల అరుదైన చికిత్స - అసాధారణ స్థాయిలో గుండెకొట్టుకునే వ్యక్తికి అరుదైన శస్త్రచికిత్స చేసిన ఏఐజీ వైద్యులు

Heart Surgery: అసాధారణ స్థాయిలో గుండెకొట్టుకుంటున్న వ్యక్తికి అరుదైన శస్త్రచికిత్స చేసి.. విజయం సాధించారు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు చెందిన ఏఐజీ ఆస్పత్రి వైద్యులు. యువకుడికి గుండె కిందిభాగంలోని గదులు వేగంగా కొట్టుకుంటున్నట్టు నిర్ధరించారు. సాధారణంగా ఇలాంటి శస్త్రచికిత్సలు అత్యంత క్లిష్టమైనవి కాగా.. అప్పటికే యువకుడి గుండెలో ఆర్టిఫీషియల్ పంప్ ఉన్నందున శస్త్రచికిత్స ఇబ్బందికరంగా మారినట్లు వైద్యులు పేర్కొన్నారు.

Heart Surgery by Hyderabad AIG hospital doctors
అసాధారణ స్థాయిలో గుండెకొట్టుకునే వ్యక్తికి అరుదైన శస్త్రచికిత్స

By

Published : Apr 7, 2022, 3:33 PM IST


Heart Surgery: అసాధారణ స్థాయిలో గుండె కొట్టుకుంటున్న వ్యక్తికి.. తెలంగాణలోని హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి విజయం సాధించారు. 34 ఏళ్ల ఓ వ్యక్తికి గతంలో హార్ట్ ఫెయిల్ కావటంతో.. వైద్యులు కృత్రిమ హార్ట్‌పంప్‌ని అమర్చారు. ఇటీవల గుండె కొట్టుకునే వేగం పెరగడంతో.. యువకుడు ఏఐజీ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. యువకుడికి వెంట్రిక్యులార్ టాకీకార్డియా అనే వ్యాధి ఉందని గుర్తించిన వైద్యులు.. గుండె కిందిభాగంలోని గదులు వేగంగా కొట్టుకుంటున్నట్టు నిర్ధారించారు.

హార్ట్‌ ఫెయిల్‌.. ఏఐజీ వైద్యుల అరుదైన చికిత్స

వ్యాధి నియంత్రణ కోసం మందులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో.. రక్తనాళాల ద్వారా గుండె లోపలికి ఎలక్ట్రో క్యాథటర్స్‌ని పంపి.. సమస్య కారణాలను విశ్లేషించారు. అనంతరం త్రీ డీ మ్యాపింగ్ పద్ధతిలో ఆ ప్రాంతంలో రేయిడో ఫ్రీక్వెన్సి ఎనర్జీని పంపటం ద్వారా వేగాన్ని నియంత్రించారు. దేశంలోనే మొట్టమొదటిసారి ఏఐజీ వైద్యులు ఈ తరహా శస్త్రచికిత్స చేసినట్టు ప్రకటించారు. సాధారణంగా ఇలాంటి శస్త్రచికిత్సలు అత్యంత క్లిష్టమైనవి కాగా.. అప్పటికే యువకుడి గుండెలో ఆర్టిఫీషియల్ పంప్ ఉన్నందున శస్త్రచికిత్స ఇబ్బందికరంగా మారినట్లు వైద్యులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. వృద్ధురాలి వైద్యానికి ముందుకొచ్చిన ఆర్టీసీ అధికారులు

ABOUT THE AUTHOR

...view details