రాయలసీమ ఎత్తిపోతలపై వేసిన ధిక్కరణ పిటిషన్‌ను ఎన్‌జీటీ విచారణ చేసింది. పనులు చేయవద్దన్న ఎన్‌జీటీ ఆదేశాలను ఉల్లంఘించారని పిటిషనర్ తెలిపారు. ప్రాజెక్టు పనులు జరపడం లేదని ఎన్‌జీటీకి రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సమాయత్త పనులు, అధ్యయనాలే చేస్తున్నాని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాజెక్టు ప్రధాన పనులు జరగడం లేదని ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది.
రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్‌జీటీలో విచారణ - ఎన్‌జీటీ విచారణ తాజా వార్తలు
రాయలసీమ ఎత్తిపోతలపై వేసిన ధిక్కరణ పిటిషన్‌పై ఎన్‌జీటీలో విచారణ జరిగింది. ఎన్‌జీటీ చెన్నై బెంచ్‌లో పిటిషన్‌ను గవినోళ్ల శ్రీనివాస్ వేశారు.
రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్‌జీటీలో విచారణ