ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడికి బెయిల్ నిరాకరణ - సుప్రీంకోర్టులో చిగురుపాటి జయరా హత్య కేసు విచారణ

పారిశ్రామికవేత్త, ఎక్స్​ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడు రాకేశ్ రెడ్డికి బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ కోరుతూ రాకేష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారించింది.

suprem court
చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడికి బెయిల్ నిరాకరణ

By

Published : Dec 2, 2020, 10:57 PM IST

పారిశ్రామికవేత్త, ఎక్స్​ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడు రాకేశ్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్ కోరుతూ రాకేష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్దా బోస్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. నిందితుడు 21 నెలలుగా జైలులోనే ఉన్నాడని.. వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. రాకేష్ రెడ్డిపై మరో 10 కేసులు ఉన్నాయన్న ధర్మాసనం.. బెయిల్ ఇవ్వమని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది హాజరుకాకపోవడం వల్ల వచ్చే వారానికి విచారణను వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details