ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాలపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నిబంధనలు చెప్పకుండా ప్రవేశ మార్గదర్శకాలు జారీ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాదులు ఆదినారాయణరావు, వెంకటరమణలు వాదనలు వినిపించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు లేకుండానే బోర్డు ఆదేశాలిచ్చిందన్నారు. ఇంటర్ కళాశాలల్లో ఆగస్టు 16 నుంచి తరగతులు ప్రారంభించారన్న పిటిషనర్..ప్రవేశాలు ఆన్‌లైన్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
Inter Online Admissions: ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాలపై హైకోర్టులో విచారణ..తీర్పు రిజర్వ్ - ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాలపై హైకోర్టులో విచారణ
ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాలపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ
16:52 August 25
ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాలపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే ఆన్‌లైన్ ప్రవేశాలు ప్రవేశపట్టామని బోర్డు తరఫు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. కొవిడ్ నిబంధనల మేరకే ఆన్‌లైన్ ప్రవేశాలు చేశామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
ఇదీ చదవండి
Last Updated : Aug 25, 2021, 5:49 PM IST