ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో రెమ్‌డెసివిర్‌ ఔషధాలకు కొరత లేదు: సింఘాల్‌

ప్రభుత్వాస్పత్రులతో పాటు, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రెమ్‌డెసివిర్‌ ఔషధాలకు కొరత రాకుండా చర్యలు తీసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. రాష్ట్రంలో కేసులకు తగ్గట్లు పడకలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అధికారులు ఎప్పటికప్పుడు ఆస్పత్రుల్లో పర్యవేక్షిస్తున్నారని సింఘాల్ వెల్లడించారు.

By

Published : May 18, 2021, 9:33 PM IST

Health Secretary singhal on corona cases in ap
రాష్ట్రంలో రెమ్‌డెసివర్‌ ఔషధాలకు కొరత లేదు

రాష్ట్రంలో రెమ్‌డెసివర్‌ ఔషధాలకు కొరత లేదు

ప్రభుత్వాస్పత్రులతో పాటు, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రెమ్‌డెసివిర్‌ ఔషధాలకు కొరత రాకుండా చర్యలు తీసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు ఆస్పత్రుల్లో పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. బ్లాక్‌ఫంగస్‌కు వాడే ఇంజక్షన్లు మూడు రోజుల్లో రాష్ట్రానికి రానున్నాయని చెప్పారు. రాష్ట్రంలో కేసులకు తగ్గట్లు పడకలు సిద్ధం చేస్తున్నామని సింఘాల్‌ చెప్పారు.

కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు దహన సంస్కారాలకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించేలా జీవో ఇచ్చామన్నారు. ఈ పరిస్థితుల్లో కేసుల వివరాలు బహిర్గతం చేయకుండా గోప్యత పాటించాల్సిన పరిస్థితి లేదన్నారు. కర్ఫ్యూలో మార్పులు, లాక్ డౌన్ విధిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సింఘాల్‌ ఖండించారు. సామాజిక మాద్యమాల్లో మృతుల గురించి తప్పుడు ప్రచారం జరుగుతోందని...ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు.

రాష్ట్రంలో చేపట్టిన మొదటి జ్వరపీడితుల గుర్తింపు సర్వే పూర్తయిన వెంటనే తదుపరి సర్వే కొద్ది రోజుల పాటు కొనసాగించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించామన్నారు. ఈనెల 15 నుంచి నిర్వహించిన సర్వేలో 90 వేల మంది జ్వరపీడితులను గుర్తించామన్నారు. 50 వేల మంది జర్వపీడితుల నుంచి రక్త నమూనాలు సేకరించామని సింఘాల్ వెల్లడించారు. వారిలో కొందరికి కరోనా నిర్ధరణ అయిందని..తక్కువ లక్షణాలున్న వారిని హోం ఐసోలేషన్​లో ఉంచి వారికి కిట్లు ఇవ్వాలని ఆదేశించామన్నారు. ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, గ్రామ వాలంటీర్ల సహాయంతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల వ్యవధిలోనే జ్వరపీడుతులను గుర్తించగలిగామన్నారు.

ఇదీచదవండి: రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్​తో మరొకరు మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details