రాష్ట్రంలో మే 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది పూర్తిస్థాయి లాక్డౌన్ కాదన్న వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్.. కర్ఫ్యూకు సంబంధించిన మార్గదర్శకాలను మంగళవారం జారీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తిపై సీఎం జగన్ సమీక్షించారని.. వైరస్ తీవ్రత దృష్ట్యా బుధవారం నుంచి రాష్ట్రంలో 144 సెక్షన్ అమలుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే ఆర్థిక కార్యకలాపాలకు అనుమతి ఉంటుందన్నారు. నిత్యం మధ్యాహ్నం 12 గంటల తర్వాత పాక్షిక కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని చెప్పారు.
అత్యవసర సర్వీసులకు అనుమతి
అత్యవసర సర్వీసులకు ఎప్పటిలాగే అనుమతులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఆంక్షల సమయంలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాల్సిందిగా సింఘాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మార్కెట్లు, బహింరగ ప్రదేశాల్లో గుంపులుగా చేరి కరోనా వ్యాప్తికి కారణం కావొద్దని సూచించారు.
ఆ ప్రచారం అవాస్తవం