రాష్ట్ర ప్రభుత్వం కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలుపై స్పష్టత ఇచ్చింది.కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారతీయ వైద్య పరిశోధక మండలి అనుమతిచ్చిన ఎస్డీ బయో సెన్సర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచే కిట్లు కొనుగోలు చేశామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఒప్పదం కుదుర్చుకున్న తర్వాత ఎవరికైనా అంతకంటే తక్కువ ధరకు అమ్మితే... తుది బిల్లులో ఆ మేరకు కోత విధిస్తామని సదరు కంపెనీకి ముందే షరతు విధించినట్లు స్పష్టంచేశారు. ఛత్తీస్‌గఢ్ తరహాలోనే తాము డబ్బు చెల్లిస్తామని ఇప్పటికే కొరియా కంపెనీకి నోటీసు ఇచ్చినట్లు రాష్ట్ర కుటుంబ ఆరోగ్యం, సంక్షేమ శాఖ కమిషనర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేశారు
ర్యాపిడ్ కిట్ల కొనుగోలుపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం - @corona ap cases
దక్షిణకొరియా నుంచి కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను పారదర్శకంగానే కొనుగోలు చేశామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 337 రూపాయల చొప్పున కొనుగోలు చేయగా ఏపీ ప్రభుత్వం మాత్రం 730 రూపాయల చొప్పున లక్ష కిట్లు దిగుమతి చేసుకుంది. దీనిపై ఆరోపణలు రావడంతో... వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వివరణ ఇచ్చారు.
ర్యాపిడ్ కిట్ల కొనుగోలుపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం