ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్రానికి 4.40 లక్షల టీకాలు వచ్చాయి... మరో 2 లక్షలు రానున్నాయి' - రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ

సీఎం లేఖకు స్పందించి రాష్ట్రానికి కరోనా టీకా పంపిన ప్రధానికి వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే 4.40 లక్షల టీకాలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా.. ఈరోజు మరో 2 లక్షల డోసులు రానున్నట్లు ప్రకటించారు.

health minister alla nani, minister alla nani clarity on covid vaccine arrival to state
వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, రాష్ట్రానికి కొవిడ్ డోసుల రాకపై మంత్రి ఆళ్లనాని స్పష్టత

By

Published : Apr 13, 2021, 12:34 AM IST

రాష్ట్రంలో వ్యాక్సినేషన్​కు ఆటంకం కలగకుండా.. 4.40 లక్షల కొవిషీల్డ్ డోసులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ఈరోజు హైదరాబాద్ నుంచి మరో 2 లక్షల కోవ్యాక్సిన్ టీకాలు రానున్నాయని తెలిపారు. సీఎం లేఖ రాయగానే స్పందించి.. ఏపీకి వ్యాక్సిన్ పంపిన ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:మహారాష్ట్రలో మరో 51వేల కరోనా కేసులు

గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న 4.40 లక్షల కొవిషీల్డ్ డోసులను తక్షణమే అన్ని జిల్లాలకు పంపాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి ప్రకటించారు. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకా అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్​పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు.. వాలంటీర్లు, ఆశా వర్కర్ల సేవలను వినియోగించుకుంటున్నామని వెల్లడించారు. ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో అర్హులైన వారందరికీ వ్యాక్సిన్​ వేస్తామని చెప్పారు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం 'టెస్టింగ్, ట్రాకింగ్, ట్రేసింగ్' విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 3,263 కరోనా కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details