ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లింగ నిర్ధారణ పరీక్షలు చేసే కేంద్రాలపై కఠిన చర్యలు: కాటంనేని భాస్కర్ - health family welfare comissioner latest news

లింగ నిర్ధారణ కోసం స్కానింగ్ చేయించుకోవడం నేరమని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ తెలిపారు. అలా ఎవరైనా చేయించుకుంటే సమాచారాన్ని 104 నెంబర్​కు తెలియజేయాలని సూచించారు.

లింగ నిర్ధారణ పరీక్షలు చేసే కేంద్రాలపై కఠిన చర్యలు: కాటంనేని భాస్కర్
లింగ నిర్ధారణ పరీక్షలు చేసే కేంద్రాలపై కఠిన చర్యలు: కాటంనేని భాస్కర్

By

Published : Oct 12, 2021, 2:55 PM IST

చట్ట వ్యతిరేకంగా పని చేస్తున్న లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ కేంద్రాల వివరాలు ఇస్తే నగదు బహుమతి ఇవ్వనున్నట్టు కుటుంబ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా స్కానింగ్ కేంద్రాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించింది. స్కానింగ్ కేంద్రాల వివరాలు ఇచ్చి కేసు నమోదు అయితే రూ. 25 వేల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు కుటుంబ ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. కోర్టు ద్వారా శిక్ష ఖరారు అయితే లక్ష రూపాయల నగదు ప్రభుత్వం నుంచి అందుతుందని స్పష్టం చేశారు.

సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రభుత్వం వెల్లడించింది. లింగ నిర్ధారణ కోసం స్కానింగ్ చేయించుకోవటం చట్టరీత్యా నేరమని.. ఆ సమాచారాన్ని 104 నెంబరుకు తెలియజేయాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

ఇదీ చదవండి:

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టులో విచారణ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details