Vijayawada Kanaka Durga temple: అమ్మవారి దర్శనం చేసుకోవాలనే కోరిక తీర్చడం కోసం.. ఓ కుమారుడు తన తల్లిని చేతలతో మోసుకుని ఆలయానికి తీసుకువచ్చాడు. సుశీల కుమారుడైన జగన్నాథరావు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదవాడ నుంచి విజయవాడ వరకు ఓ కారులో చేరుకున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కేశఖండనశాల నుంచి మోడల్ గెస్ట్‌హౌస్ వరకు తల్లిని చేతులతో ఎత్తుకుని నడుస్తూ ముందుకు సాగారు. అక్కడ భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత బస్సులో కొండపైకి వెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ తల్లిని తన చేతుల్లోకి తీసుకుని దుర్గమ్మ ఆలయం లోపలికి వెళ్లి దర్శనం చేసుకున్నారు.
Kanaka Durga : అమ్మలగన్నఅమ్మ కోసం.. కుమారుడి భుజాలపై ఓ అమ్మ - అమ్మను భుజాలపై మోసుకొచ్చాడు
Ammadarsanam: అమ్మలగన్న అమ్మ..ముగ్గురమ్మల.. మూలపుటమ్మ ను దర్శిస్తే, కష్టాలు పోయి.. సకల ఐశ్వర్యాలు సిద్దిస్తాయని నమ్మకం. అందుకోసం భక్తులు ఎంతటి కష్టమైన అమ్మవారిని దర్శించుకుని.. దివ్యఆశీస్సులు తీసుకుంటారు. అలాంటి కోవలోనే అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ భక్తుడు.. తన తల్లి కొండ ఎక్కలేని పరిస్థితిలో ఉంటే.. భుజాలపై కొండపైకి తీసుకెళ్లి దర్శనం చేయించాడు. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు, అమ్మా.. కనకదర్గమ్మ అంటూ..ఆ భక్తుడిని అభినందించారు.
Vijayawada Kanaka Durga temple