ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Wakf Board Issue: వక్ఫ్‌ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం - wakf board news

వక్ఫ్‌ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం ధాఖలైంది. విజయవాడకు చెందిన వ్యాపారి అబ్దుల్ ఖాదర్ మహ్మద్ ఈ వ్యాజ్యాన్ని వేశారు.

hc on wakf board members
hc on wakf board members

By

Published : Feb 19, 2022, 7:32 AM IST

రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. విజయవాడకు చెందిన వ్యాపారి అబ్దుల్ ఖాదర్ మహ్మద్ ఈ వ్యాజ్యాన్ని వేశారు. వక్ఫ్‌ బోర్డు పరిపాలన వ్యవహారంలో చోటు చేసుకున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి, వక్ఫ్‌ సీఈవో అలీంబాష, ఎనిమిది మంది బోర్డు సభ్యులు, సీబీఐ డైరెక్టర్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

వక్ఫ్‌ చట్టం సెక్షన్ 14 ప్రకారం సభ్యుల నియామకానికి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాల్సి ఉందన్నారు. అందుకు భిన్నంగా నామినేషన్ ఆధారంగా పలువురు సభ్యులను నియమించారన్నారు. వివిధ కేటగిరీలకు చెందిన వారిని బోర్డు సభ్యులుగా నియమించాల్సి ఉందన్నారు. ముస్లిం పార్లమెంట్, శాసనసభ్యులు బోర్డులో సభ్యులుగా ఉండాలన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని బోర్డు సభ్యులను నియామక జీవోను రద్దు చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details