కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ కారాగారాల్లో ఉన్న ఖైదీలు మధ్యంతర బెయిలుపై 179 మంది మాత్రమే విడుదల అవ్వడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది . జైళ్లలో మొత్తం ఎందమంది ఉన్నారని ప్రశ్నించగా .. 6620 ఉన్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 6620 మందితో పోలిస్తే 179 సంఖ్య చాలా తక్కువ అని వ్యాఖ్యానించింది. మధ్యంతర బెయిలుపై విడుదల చేసేందుకు అనుసరించిన విధానం, ఎలాంటి నేరాలకు పాల్పడిన వారు మధ్యంతర బెయిలు పొందేందుకు అనర్హులో తదితర వివరాలతో మెరుగైన అఫిడవిట్ వేయాలని జైళ్ల శాఖ డీజీని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా కారాగారాల్లో ఉన్న ఖైదీలకు కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అర్హులైన ఖైదీలు, విచారణ ఖైదీల విడుదలకు ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ జోయ్ మల్య బాగ్చి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ పలు తీర్మానాలు చేసింది. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. సుమోటోగా నమోదు చేసిన వ్యాజ్యంపై మరోసారి విచారణ జరిపింది. పీపీ వాదనలు వినిపిస్తూ తాజాగా 179 మంది మధ్యంతర బెయిలుపై విడుదల అయ్యారన్నారు. గతేడాది ఆదేశాల ప్రకారం కొందరు విడుదల అయ్యారన్నారు. వారిలో వంద మందికిపైగా తిరిగి జైళ్లకు రాలేదని, వారికి మధ్యంతర బెయిలు పొడిగించారని తెలిపారు.
179 మంది ఖైదీలే విడుదలయ్యారా!: హైకోర్టు - prisoners release in ap
కొవిడ్ నేపథ్యంలో జైళ్లలో ఖైదీలను మద్యంతర బెయిలుపై విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ కారాగారాల్లో ఉన్న ఖైదీలు మధ్యంతర బెయిలుపై 179 మంది మాత్రమే విడుదల అవ్వడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది . మధ్యంతర బెయిలుపై విడుదల చేసేందుకు అనుసరించిన విధానం, ఎలాంటి నేరాలకు పాల్పడిన వారు మధ్యంతర బెయిలు పొందేందుకు అనర్హులో తదితర వివరాలతో మెరుగైన అఫిడవిట్ వేయాలని జైళ్ల శాఖ డీజీని ఆదేశించింది.
hc on jails in corona situation