అనంతపురం జిల్లా ఆత్మకూరు పీఎస్‌లో సీఆర్‌పీసీ సెక్షన్ 107 కింద నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని పరశురాముడు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం సీఆర్‌పీసీ సెక్షన్ 107 కింద పోలీసులు కేసులు నమోదు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లలోని ఎస్సైలకు ఉత్తర్వులివ్వాలని డీజీపీకి సూచించింది.
HIGH COURT: సెక్షన్ 107 కింద పోలీసులు కేసులు నమోదు చేయొద్దు..డీజీపీకి హైకోర్టు ఆదేశం
16:42 September 08
సెక్షన్ 107 కింద పోలీసులు కేసు నమోదు చేయెుద్దంటూ డీజీపీకి ఆదేశాలు
అల్లర్లు సృష్టిస్తారని సమాచారం ఉన్న వారిని ముందుగానే బైండోవర్ చేసేందుకు తహసీల్దార్లకు సీఆర్‌పీసీ సెక్షన్ 107 కింద అధికారం ఉందని పరశురాముడు తరఫున న్యాయవాది కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. తహసీల్దార్లకు ఉన్న అధికారాన్ని పోలీసులు లాగేసుకుని.. లక్షలమందిపై వేల సంఖ్యలో ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం అనంతపురం జిల్లా ఆత్మకూరులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని తీర్పు వెలువరించింది. ఇకపై సెక్షన్ 107 కింద కేసులు నమోదు చేయకుండా పోలీసు సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేయాలని డీజీపీని ఆదేశించింది.
ఇదీ చదవండి:
chavithi celebrations: వినాయక చవితి ఉత్సవాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్