ఈ కరోనా టెస్టులో ప్రజలందరూ ఓపిగ్గా ఆడి.. వైరస్‌పై విజయం సాధించాలని టీమిండియా ఆటగాడు హనుమ విహారి కోరుతున్నాడు. ఇన్నేళ్లూ.. క్రికెట్ ప్రాక్టీస్, టూర్లు అంటూ ఖాళీ లేకుండా గడిపిన తాను.. అనుకోకుండా వచ్చిన ఈ విరామాన్ని ఆస్వాదిస్తున్నాని చెబుతున్నాడు. కరోనా తర్వాత క్రికెట్‌లోనూ చాలా మార్పులొస్తాయంటున్న విహారి... ఆటగాళ్లు పూర్వపు ఫామ్ అందుకునేందుకు శ్రమించాల్సిందేనంటున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆటగాడిగా ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు ఏలా కష్టపడున్నాడు ? తన ఫేవరేట్ తెలుగు నటుడు ఎవరు ? మొదటి టెస్ట్ సెంచరీ జ్ఞాపకాలేంటి ? ఈ విషయాలు ఈటీవీ భారత్ తో పంచుకున్నాడు.
'కరోనాతో ఓపిగ్గా ఆడి.. విజయం సాధించాలి' - హనుమ విహారితో ముఖాముఖి
కరోనా తర్వాత క్రికెట్‌లోనూ చాలా మార్పులొస్తాయని భారత టెస్ట్ ప్లేయర్, యువ తెలుగు క్రీడా కెరటం క్రికెటర్ హనుమ విహారి అంటున్నాడు. ఈ లాక్‌డౌన్ సమయంలో తన ఫిట్ నెస్ ఎలా కాపాడుకుంటున్నాడో...అసలీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాడో అతని మాటల్లోనే..
హనుమ విహారితో ముఖాముఖి