ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బెంజి సర్కిల్ వద్ద వేలాడే సిగ్నల్స్, ప్రయాణికులకు ఇక్కట్లు - Hanging traffic signals details

Hanging signals మాములుగా అయితే సిగ్నల్స్‌ స్థంభాలకు బిగించి ఉంటాయి. కాని విజయవాడ ట్రాఫిక్​ పోలీసులు మాత్రం రెండు వంతెనల దిమ్మలకు మేకులు కొట్టి సిగ్నల్స్​ను అమర్చారు. బెంజ్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ సిగ్నల్స్‌ ఎక్కడ ఉన్నాయో వెతికి, అవి ఇచ్చే సిగ్నల్ ను అనుసరించలేక వాహనదారులు ఇక్కట్లకు గురవుతున్నారు.

Hanging signals
బెంజ్‌ సర్కిల్‌ వరకు వెలాడే సిగ్నల్స్

By

Published : Aug 20, 2022, 12:16 PM IST

Hanging traffic signals విజయవాడలో అత్యంత ట్రాఫిక్‌ రద్దీ ఉండే బెంజ్‌ సర్కిల్‌ కూడలిలో ఇటీవల అమర్చిన ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఇవి. రెండు పైవంతెనల దిమ్మెలకు మేకులుకొట్టి తీగలతో వీటిని బిగించారు. గాలివచ్చినప్పుడు ఊగుతూ.. అటుఇటూ ప్రమాదకరంగా కదులుతున్నాయి. దీంతో వాహనదారులకు సిగ్నల్స్‌ సరిగా కనపడకపోవడంతో రెడ్‌ సిగ్నల్‌ పడినా వచ్చేస్తున్నారు. కాస్త తెలిసిన వారు సిగ్నల్స్ ను అనుసరించేందుకు బ్రిడ్జివైపు తీక్షణంగా చూస్తున్నారు. నిబంధనల ప్రకారం మూడు డైరెక్షన్లలోని సిగ్నల్స్‌ వాహనదారులకు కనిపించేలా ఒకే స్తంభానికి అమర్చాలి. ఎత్తులో కాకుండా వాహనదారులకు కనిపించేలా ఒక నిర్ణీత ఎత్తులో వీటిని అమర్చాల్సి ఉంది.కొన్నింటిని వంతెనలకు వేలాడదీసి వంతెనకు మేకులుకొట్టి అమర్చారు. వీటివల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details