ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Vasathi Deevena: విద్యార్థులకు వసతి దీవెన సాయం సగమేనా?

Vasathi deevena: గడిచిన రెండు విద్యా సంవత్సరాల్లో వసతి, భోజన ఖర్చుల కింద ఇచ్చే వసతి దీవెన సాయం.. సగమేనా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2020-21 విద్యాసంవత్సరానికి కరోనా వ్యాప్తి నేపథ్యంలో తరగతులు జరగలేదని.. ఆ ఏడాదికి సగమే ఇచ్చారు.

half money is given to students through vasathi deevena scheme
విద్యార్థులకు వసతి దీవెన సాయం సగమేనా

By

Published : Apr 8, 2022, 9:23 AM IST

Vasathi deevena: ప్రభుత్వం గడిచిన రెండు విద్యా సంవత్సరాల్లో వసతి, భోజన ఖర్చుల కింద ఇచ్చే వసతి దీవెన సాయం సగమేనా? అనే విమర్శలు విద్యార్థుల నుంచి వినిపిస్తున్నాయి. వసతి దీవెన కింద ఏటా రెండు విడతల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్‌, వైద్య, తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20వేల చొప్పున వసతి, భోజన ఖర్చులకు ప్రభుత్వం చెల్లిస్తోంది. 2020-21 విద్యాసంవత్సరానికి కరోనా వ్యాప్తి నేపథ్యంలో తరగతులు జరగలేదని.. ఆ ఏడాదికి సగమే ఇచ్చారు. దీంతో రూ.1000 కోట్లకు కోత వేసినట్లయింది.

తాజాగా 2021-22 విద్యాసంవత్సరానికి వసతి దీవెన కింద రూ.1,024 కోట్ల మొత్తం రెండో విడతగా చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. అంటే 2021-22 ఏడాదికి కూడా ఇచ్చేది సగమేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వం గత విద్యాసంవత్సరం (2020-21)లాగే ఇప్పుడూ ఒక విడత చెల్లింపునకే పరిమితం అవుతుందా? లేదా మరోసారి మిగిలిన మొత్తం విడుదల చేస్తుందా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. 2021-22 ఏడాదికి కూడా సగమే ఇస్తే ప్రభుత్వం మరో రూ.1000 కోట్లు మిగుల్చుకున్నట్లు అవుతుంది. దీంతో మొత్తంగా రెండేళ్లలో రూ.2 వేల కోట్ల మేర ప్రభుత్వానికి మిగలనుంది.

ABOUT THE AUTHOR

...view details