GVL letter to union ministers: ఏపీ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతూ భాజపా ఎంపీ జీవీఎల్.నరసింహారావు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. అనేక కేంద్ర సంస్థలు అమరావతిలో స్థల సేకరణ జరిపాయని.., అయితే ప్రభుత్వ మార్పు, మూడు రాజధానుల ప్రతిపాదన వంటి కారణాలతో ఆయా శాఖలు వేచి చూశాయని లేఖలో తెలిపారు. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ, అమరావతే ఏకైక రాజధాని అని హైకోర్టు ఇచ్చినతీర్పు దృష్ట్యా ఇక జాప్యం లేకుండా ఆయా శాఖలు, సంస్థలూ కార్యాలయాలు నిర్మించాలని జీవీఎల్ నరసింహారావు తన లేఖల్లో కోరారు. స్థలాలలో ఆరు నెలలలోగా భవన నిర్మాణం ప్రారంభించాలన్న షరతు ఉన్న విషయాన్ని జీవీఎల్ నరసింహారావు గుర్తు చేస్తూ ఇప్పటికైనా నిర్మాణాలపై దృష్టి సారించాలని కోరారు.
కేంద్ర మంత్రులకు జీవీఎల్ లేఖ... ఎందుకోసమంటే..? - GVL on Central government Offices in AP
GVL on Central government Offices in AP: ఏపీ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతూ భాజపా ఎంపీ జీవీఎల్.నరసింహారావు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు.
GVL