వైకాపా నేతలు పొరుగు రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు మద్యం తెచ్చి.. రాష్ట్రంలో అధిక ధరలకు అమ్ముకుంటున్నారని తెదేపా సీనియర్ నేత జీవీ ఆంజనేయులు ఆరోపించారు. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చి జే-ట్యాక్స్ రూపంలో మద్యం అమ్మకాల్లో రూ.25వేల కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. నాణ్యత లేని నాసిరకం మద్యం.. అధిక ధరకు అమ్మటం వల్ల శానిటైజర్లు, నాటు సారా తాగి వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్.. టీచర్లను సైతం దుకాణాల వద్ద కాపలా పెట్టి మద్యం అమ్మకాలు నిర్వహించడంపై మండిపడ్డారు. వినాయక మండపాలకు మాత్రం అనుమతులివ్వకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో జే-బ్రాండ్ మద్యం అమ్ముతూ వైకాపా నాయకులు రూ. 6వేల కోట్లు కొల్లగొట్టారని.. బోండా ఉమ ఆరోపించింది. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యం గుల్ల చేస్తున్నారని.. తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమా మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తెచ్చేదంతా వైకాపా నాయకులేనన్నారు. పనిలో పనిగా మద్యం తాగేవారందరి తలల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి, ప్రభుత్వం అప్పులు తెస్తోందన్నారు. త్వరలో 'జగనన్న మద్యం డోర్ డెలివరీ' పేరిట వాలంటీర్లతో ఇంటింటికీ మద్యం సరఫరా చేయించేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. మద్యంలోనే వైకాపా నేతల జేబుల్లోకి వెళ్లాయని బోండా ఉమా ఆరోపించారు.