స్వార్థప్రయోజనాల కోసం పోలవరం ఎత్తు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని జీవీ ఆంజనేయులు విమర్శించారు. ప్రజలు, రైతుల్లో వ్యతిరేకత చూసి మాటమార్చుతున్నారని ఆరోపించారు. అవినీతి వాటాలు పక్కనపెట్టి పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల్లో వ్యతిరేకత చూసే జగన్ స్థానిక ఎన్నికలకు వెనుకంజ వేస్తున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధి చేతకాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలపై దాడులను ప్రోత్సహించారని మండిపడ్డారు. కేంద్ర బలగాల సాయంతో ఎన్నికలు జరిగితే రిగ్గింగ్ లకూ దౌర్జన్యాలకు అవకాశం ఉండదనే వాయిదా కోరుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా? బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
చరిత్రహీనులుగా జగన్ మిగిలిపోతారు: ఆంజనేయులు - స్థానిక ఎన్నికలపై ప్రభుత్వంపై టీడీపీ కామెంట్స్
రాష్ట్ర ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లలేని జగన్ ప్రభుత్వం విగ్రహాల రాజకీయం మెుదలుపెట్టిందని నర్సరావుపేట తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే జగన్ చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.

చరిత్రహీనులుగా జగన్ మిగిలిపోతారు: ఆంజనేయులు