Sheikh Saadia Almas: జీవితంలో సాధించాలనే పట్టుదల ఉంటే విజయం కచ్చితంగా సొంతమవుతుందని నిరూపిస్తోంది.. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన షేక్ సాదియా అల్మాస్. తండ్రి మార్గ నిర్దేశంలో.. ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని వడివడిగా అడుగులు వేస్తోంది. ఇక్కడ కోచింగ్ ఇస్తున్న ఈయనే.. సాదియా తండ్రి సందానీ. పవర్ లిఫ్టింగ్‌లో సాధిక గురువు కూడా ఈయనే. పవర్ లిఫ్టింగ్‌లో 2002లో ఇండియా టైటిల్ విజేత. కెరీర్ ముగిశాక.. ఓ జిమ్‌ను నిర్వహిస్తున్నాడు.. సందానీ. తండ్రి అభిరుచినే పునికి పుచ్చుకున్న సాదియా.. జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్‌లో పతకాలు సాధించాలని నిర్ణయించుకుంది.
ఏడాదిలోనే జాతీయ పతకం..
తండ్రి పర్యవేక్షణలో సాధన ప్రారంభించిన సాదియా.. శిక్షణ ప్రారంభించిన ఏడాదే.. జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్యం పతకాన్ని గెలుచుకుంది. అనతి కాలంలోనే 3 సార్లు అంతర్జాతీయ స్థాయి పతకాలు తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ఏషియన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించింది..ఈ యువ పవర్ లిఫ్టర్. తనకిష్టమైన పవర్ లిఫ్టింగ్‌లో... రోజూ 5 నుంచి 6 గంటల పాటు సాధన చేస్తుంది.. సాదియా. ఆ కారణంగా..రాష్ట్ర స్థాయిలో 5 సార్లు, జాతీయ స్థాయిలో 3 సార్లు స్ర్టాంగ్ గర్ల్ టైటిళ్లు గెలుచుకుంది. 3 సార్లు ఏషియన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తలపడిన సాదియా...రజతం, స్వర్ణం పతకాలు దక్కించుకుంది.