గులాబ్ తుపాను(gulab cyclone) ప్రభావంతో విజయవాడ శివారు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి.. లోతట్ట ప్రాంతాలు నీట మునిగాయి. ఎల్బీఎస్ నగర్(l.b.s nagar)లో రెండు అడుగుల మేర వరద నీరు నిలిచి ఉంది. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నూజీవీడు-విజయవాడ రహదారిపై వరదనీరు ప్రవహించటంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నున్న గ్రామీణ పోలీస్టేషన్ నీట మునిగింది. బెంజ్ సర్కిల్, నిర్మలా కాన్వెంట్, మొఘల్ రాజపురం, వన్ టౌన్ కొండప్రాంతం, సింగ్ నగర, రోడ్లన్నీ పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి. డ్రైనేజీలు సరిగ్గా లేకపోవటం, నగరపాలక శాఖ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Gulab Cyclone Effect: జలదిగ్బంధంలో విజయవాడలోని పలు కాలనీలు - జలదిగ్బంధంలో విజయవాడలోని పలు కాలనీలు వార్తలు
గులాబ్ తుపాను(gulab cyclone) ప్రభావంతో విజయవాడ శివారు కాలనీలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి.. లోతట్ట ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
జలదిగ్బంధంలో విజయవాడలోని పలు కాలనీలు