మాన్యువల్ మూల్యాంకనం వల్ల తమకు అన్యాయం జరిగిందంటూ ఏపీపీఎస్సీ గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఫలితాల తారుమారుపై అనుమానాలున్నాయంటూ 2018 ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్‌లో మెయిన్స్ రాసిన అభ్యర్థులు ధర్నాకు దిగారు. డిజిటల్ మూల్యాంకనంలో 326 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయితే... మాన్యువల్ విధానంలో కేవలం 124 మందే ఎంపికయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీపీఎస్పీ భవనం వద్ద.. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన - group 1 candidates concern news
APPSC : 2018 ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్‌లో మెయిన్స్ రాసిన అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. మాన్యువల్ మూల్యాంకనం వల్ల తమకు అన్యాయం జరిగిందంటూ.. 202 మంది అభ్యర్థులు వాపోయారు. న్యాయం చేయాలంటూ ఏపీపీఎస్పీ భవనం వద్ద నిరసనకు దిగారు.
APPSC
న్యాయం చేయాలంటూ 202 మంది అభ్యర్థులు ఏపీపీఎస్పీ భవనం వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలంటూ డిమాండ్ చేశారు. అభ్యర్థులకు మద్దతుగా ఏఐవైఎఫ్ నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి: