CJI NV RAMANA AP TOUR NEWS: సీజేఐగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా స్వగ్రామం వస్తున్న జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి వస్తున్న సీజేఐ.. రాష్ట్ర సరిహద్దు గరికపాడు చెక్‌పోస్టు వద్దకు చేరుకోగానే కృష్ణా జిల్లా యంత్రాంగం మేళతాళాలతో స్వాగతం పలికింది. జిల్లా కలెక్టర్ నివాస్, పలువురు మహిళలు.. ఆయకు ఆహ్వానం పలికి పుష్పగుచ్ఛాలు అందజేశారు. వేదపండితులు పూర్ణకుంభంతో, మేళతాళాల నడుమ స్వాగతం పలికారు. మహిళలు జాతీయజెండా చేతబూని.. ఎన్వీ రమణకు అభివాదం తెలిపారు.
Grand Welcome to CJI nv Ramana in Garikapadu: ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభాను, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రవీంద్రబాబు, రిజిస్ట్రార్ గిరిధర్, లా సెక్రటరీ సునీత, నందిగామ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్డి బి. శ్రీనివాస్, డీఐజీ రాజశేఖర్‌బాబు, స్త్రీ సంక్షేమ శాఖ కమిషనర్ కృతిక శుక్లా సహా పలువురు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు స్వాగతం పలికారు.
గరికపాడు వద్ద పటిష్ఠ బందోబస్తు..
ఈ మేరకు కృష్ణా జిల్లా యంత్రాంగం.. గరికపాడు చెక్‌పోస్టు వద్ద విస్తృత ఏర్పాట్లు చేసింది. జగ్గయ్యపేట న్యాయస్థానం, న్యాయమూర్తులు న్యాయవాదులు, విద్యాశాఖ అధికారులతో పాటు, దేవాదాయ శాఖ నుంచి వేద పండితులచే ఆశీర్వచనం ఏర్పాట్లు చేశారు. గరికపాడు చీఫ్ జస్టిస్ స్వాగత ఏర్పాట్లను కలెక్టర్ నివాస్ పర్యవేక్షించారు.