విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్వహిస్తున్న 32వ పుస్తక మహోత్సవానికి మంచి ఆదరణ లభిస్తోంది. పుస్తక ప్రదర్శనలు, విక్రయాలతో పాటు పుస్తక ఆవిష్కరణలు, చర్చాగోష్టులతో సాహితీ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. శత వసంతాల ఘంటసాల పుస్తక ఆవిష్కరణ... పుస్తక మహోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పర్యాటక సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎస్.సత్యనారాయణ, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ చినవీరభద్రుడు ఈ కార్యకమంలో పాలుపంచుకున్నారు. ఘంటసాల వ్యక్తిత్వాన్ని కొనియాడారు.
BOOK FESTIVAL : పుస్తక మహోత్సవానికి విశేషాదరణ... 'ఘంటసాలకు' ఘన నివాళి - swaraj groung
అమర గాయకుడిగా తెలుగువారి హృదయాల్లో చెరగని స్థానం సొంతం చేసుకున్నారు ఘంటసాల. ఆయన శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడ పుస్తక మహోత్సవంలో ఘన నివాళులు అర్పించారు. శతవసంతాల ఘంటసాల పుస్తకాన్ని ఆవిష్కరించారు.
![BOOK FESTIVAL : పుస్తక మహోత్సవానికి విశేషాదరణ... 'ఘంటసాలకు' ఘన నివాళి పుస్తక మహోత్సవానికి విశేషాదరణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14107968-957-14107968-1641424183869.jpg)
పుస్తక మహోత్సవానికి విశేషాదరణ
సామాజిక మాధ్యమాల ప్రభావం పెరుగుతున్నా పుస్తక పఠనానికి ఆదరణ తగ్గలేదని పుస్తక మహోత్సవం నిరూపిస్తోంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాలవారు పుస్తక ప్రదర్శనకు తరలివస్తున్నారు. అభిరుచికి అనుగుణంగా నచ్చిన పుస్తకాల్ని కొనుగోలు చేస్తున్నారు. పుస్తక మహోత్సవ ప్రాంగణంలోనే ఆత్రేయ శతజయంతి సభతో పాటు అనురాగమూర్తులు పుస్తకావిష్కరణ కార్యక్రమం కూడా నిర్వహించారు. నేడు వడ్డాది పాపయ్య శతజయంతి కార్యక్రమం నిర్వహించనున్నారు.
పుస్తక మహోత్సవానికి విశేషాదరణ
ఇదీచదవండి.
Last Updated : Jan 6, 2022, 5:10 AM IST